Actor Karthi : తమిళ హీరోస్ లో మన టాలీవుడ్ దగ్గర మార్కెట్ ఉన్న వాళ్ళ లిస్ట్ తీస్తే రజినీకాంత్ మరియు కమల్ హాసన్ కాకుండా, సూర్య మరియు ఆయన తమ్ముడు కార్తీ ఉంటారు. ముఖ్యంగా కార్తీ అంటే తెలుగు ఆడియన్స్ ఇంకా బాగా ఇష్టం. ఆయన నటించిన సినిమాలన్నిటికీ ఇక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఖైదీ చిత్రం కార్తీ కి తెచ్చిన పేరు ప్రఖ్యాతలు మామూలివి కాదు.

ఇప్పుడు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అనేది ఎంత క్రేజ్ ని సంపాదించుకుందో మన అందరికీ తెలిసిందే. దీనికి మూల కారణం ‘ఖైదీ’ చిత్రమే. ఈ సినిమా సీక్వెల్ కోసం తమిళ ఆడియన్స్ తో పాటుగా తెలుగు ఆడియన్స్ కూడా ఎప్పటి నుండో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. దీని గురించి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కార్తీ ని అడుగుతారు. ఆయన దానికి చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

కార్తీ మాట్లాడుతూ ‘వాస్తవానికి ఖైదీ సీక్వెల్ ని వచ్చే ఏడాది జనవరి నుండి ప్రారంభించాలి అనుకున్నాం. అందుకు డేట్స్ కూడా ఇచ్చేసాను, కానీ మధ్యలో రజినీకాంత్ గారు లోకేష్ ని తన కోసం ఒక సినిమా చేసి పెట్టాల్సిందిగా కోరారు. అందుకే ఆ ప్రాజెక్ట్ అయ్యాక ‘ఖైదీ 2 ‘ మొదలు అవుతుంది. నేను కూడా మీలాగే ఎప్పటి నుండో ఈ సినిమా షూటింగ్ మొదలు కావడం కోసం ఎదురు చూస్తున్నాను’ అని సమాధానం ఇస్తాడు.

అలాగే ఈ చిత్రం పూర్తి స్థాయి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ గా ఉంటుంది అంట. అంటే ఢిల్లీ పాత్రతో పాటుగా విక్రమ్, రోలెక్స్, అమర్, లియో దాస్ పాత్రలు ఉంటాయట. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తీర్చి దిద్దబోతున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.