తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎప్పటి నుండో కొనసాగుతూ ఇప్పటికీ మంచి డిమాండ్ ఉన్న నటుడిగా వ్యక్తి బ్రహ్మాజీ. మన చిన్నతనం నుండి ఇతనిని చూస్తూనే ఉన్నాము. అప్పట్లో ఎలా అయితే ఉండేవాడో , ఇప్పటికే అలానే ఉన్నాడు. అసలు ఈయనకి వయస్సు పెరుగుతుందా తరుగుతుందా అని చాలా మంది ఇంటర్వ్యూస్ లో అడుగుతూ ఉంటారు.
అదంతా పక్కన పెడితే హీరో గా , విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టు గా , కోయండియాన్ గా ఇలా అన్నీ యాంగిల్స్ లో సత్తా చాటిన బ్రహ్మాజీ కి సంజయ్ కుమార్ అనే కొడుకు ఉన్నాడు. రీసెంట్ గానే ఈయన కూడా టాలీవుడ్ లోకి హీరో గా అడుగుపెట్టాడు. తొలిసినిమా ‘ఓ పిట్టా కథ’. ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి వంటి వారు కూడా భారీ ప్రొమోషన్స్ చేసారు. కానీ కథలో దమ్ము లేకపొయ్యేసరికి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.
ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ అనే చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా రీసెంట్ గానే విడుదలైంది. ఈ చిత్రం ప్రొమోషన్స్ లో బ్రహ్మాజీ కూడా చాలా చురుగ్గా పాల్గొన్నాడు, అనేక ఇంటర్వ్యూస్ ఇచ్చాడు కూడా. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఒక యాంకర్ ప్రశ్న అడుగుతూ ‘సెట్స్ లో మీ కొడుకు తో ఎలా ఉంటారు’ అని అడుగుతుంది.
అప్పుడు బ్రహ్మాజీ దానికి సమాధానం చెప్తూ ‘సెట్స్ లోకి అడుగుపెట్టిన తర్వాత వాడికి నాకు సంబంధమే ఉండదు. వాడి పనిలో వాడు ఉంటాడు , నా పనిలో నేను ఉంటాను, ఇతర ఆర్టిస్టులతో పనిచేస్తున్నప్పుడు ఎలా అయితే ఉంటానో, అలాగే వాడితో ఉంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు బ్రహ్మాజీ. ఆయన మాటలు విని నెటిజెన్స్ షాక్ కి గురి అయ్యారు. ఈరోజే విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డివైడ్ టాక్ ని దక్కించుకుంది.