Srikanth : మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీ లో ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి?..ఎలాంటి అండదండా లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్వయంకృషి తో ఎదిగిన ప్రతీ ఒక్కరికి చిరంజీవి ఒక ఆదర్శం. టాలెంట్ ని ప్రోత్సహించడం లో ఎప్పుడూ ముందు ఉండే మొట్టమొదటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. చిన్నా పెద్ద అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాడు ఆయన. అందుకే మెగాస్టార్ చిరంజీవి ని ఇండస్ట్రీ పెద్ద అని పిలుస్తూ ఉంటారు.
ఇక ఇండస్ట్రీ లో చిరంజీవి కోసం ప్రాణాలను సైతం ఇచ్చేసే రేంజ్ అభిమానం ఉన్న హీరోలలో ఒకడు శ్రీకాంత్. ఈయనకి మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంత ప్రత్యేకమైన అభిమానం అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చిరంజీవి కూడా శ్రీకాంత్ ని తన సొంత తమ్ముడిలాగా చూసుకుంటాడు. ఇదంతా పక్కన పెడితే చిరంజీవి ని ఇష్టపడే వాళ్ళు మాత్రమే కాదు, ఆయన ఎదుగుదల ని ఓర్వలేక ఇండస్ట్రీ లో కొంతమంది అతనిపై నోటికి వచ్చినట్టు కామెంట్స్ చేసి విషం కక్కుతూ ఉంటారు.
అలా గతం లో ఒక యంగ్ హీరో చిరంజీవి పట్ల ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేసాడట. అంతే కాదు తాగేసి అప్పట్లో సోషల్ మీడియా లో చిరంజీవి ని బూతులు తిడుతూ వీడియో కూడా పెట్టాడట. ఈ వీడియో ని చూసిన హీరో శ్రీకాంత్ కి కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే ఆ యంగ్ హీరో ఉంటున్న బెంగళూరికి వెళ్లి, మా అన్నయ్య మీదనే ఇలాంటి కామెంట్స్ చేస్తావా అని పెద్దగా అరుస్తూ చితకబాది అతను సోషల్ మీడియా లో పెట్టించిన వీడియో ని డిలీట్ చేయించాడట.
ఇదే విషయాన్నీ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో శ్రీకాంత్ ని ఒక యాంకర్ అడగగా, దానికి శ్రీకాంత్ సమాధానం చెప్తూ ‘నిజమే.. ఒకసారి కాదు, చాలా సార్లు ఇలా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. నేను అమ్మా నాన్న తర్వాత అంతగా అభిమానించేది అన్నయ్య చిరంజీవి గారినే, ఎవరైనా పిచ్చి కూతలు కూస్తే చూస్తూ ఊరుకోలేను’ అంటూ శ్రీకాంత్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.