AAY : ఈ ఆగష్టు 15 వ తారీఖున మిస్టర్ బచ్చన్ , ఇస్మార్ట్ శంకర్ వంటి భారీ సినిమాలతో పాటుగా ‘ఆయ్’ అనే చిన్న చిత్రం కూడా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాని గీత ఆర్ట్స్ సమర్పణ లో బన్నీ వాసు నిర్మించారు. ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్నే ‘మ్యాడ్’ లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత ఈ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కమర్షియల్ గా ఈ చిత్రం కచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ప్రతీ ఒక్కరికి ట్రైలర్ ని చూస్తేనే అర్థం అయిపోయింది.

ఇది ఇలా ఉండగా ఈ చిత్ర నిర్మాత బన్నీ వాసు అల్లు అర్జున్ కి , అలాగే పవన్ కళ్యాణ్ కి ఎంతో సన్నిహితంగా ఉండే వ్యక్తి అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ మధ్య గ్యాప్ ఏర్పడింది అనే వార్తలు వస్తున్న వార్తలపైనా గతం లో ఆయన చాలా చక్కగా క్లారిటీ ఇచ్చాడు. కుటుంబం మొత్తం ఒక్కసారి కలిసే సందర్భం వస్తే, అంత మామూలు అయిపోతుంది, ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉండగా నిన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి ప్రముఖ హీరోయిన్ శ్రీ లీల ముఖ్య అతిథిగా విచ్చేసింది. ఈ ఈవెంట్ లో బన్నీ వాసు అల్లు అర్జున్ గురించి మాట్లాడిన ఎమోషనల్ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘మన అవసరాలు ఏంటో మనం చెప్పకుండానే మన తల్లి తీర్చేస్తుంది. అలా నాకు నా కన్న తల్లి తర్వాత, అల్లు అర్జున్ గారు ప్రతీ సందర్భంలో నాకు అవసరం వచ్చినప్పుడు అడగకముందే సహాయం చేస్తూ వచ్చారు. నాకు తెలిసిన సన్నిహితులు ‘ఆయ్’ చిత్రానికి సరిగా ప్రొమోషన్స్ జరగలేదని, అల్లు అర్జున్ గారితో ఒక్క ట్వీట్ వేయించు అని అడిగేవారు. ఈ విషయాన్ని నేను అల్లు అర్జున్ గారి వద్దకి తీసుకొని పోలేదు. కానీ ఆయన నా అవసరాన్ని గుర్తించి ట్విట్టర్ లో వెంటనే ‘ఆయ్’ సినిమా గురించి ట్వీట్ వేసాడు. ఇలా ఒక స్నేహితుడికి అవసరమైనప్పుడు అండగా నిలబడడం లో అల్లు అర్జున్ ని మించిన వారిని నేను నా జీవితం లో చూడలేదు. ఒకానొక సమయం లో నేను గీత ఆర్ట్స్ నుండి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడితే, అల్లు అర్జున్ ఆయన తండ్రి అల్లు అరవింద్ తో గొడవ పడి, నాకు అండగా నిలిచాడు. ఆయన కారణంగానే నేను ఈరోజు ఈ స్థాయిలో మీ ముందుకు వచ్చి నిల్చున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు బన్నీ వాసు.