తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని హీరోయిన్స్ లో ఒకరు ఆర్తి అగర్వాల్. విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ మూవీ ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమైనా ఈమె, ఆ సినిమా భారీ సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో వరుసగా స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి, అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈమె దాదాపుగా రెండు తరాల ప్రేక్షకులను కవర్ చేసేసింది.

నిన్నటి తరం స్టార్ హీరోలైన చిరంజీవి , నాగార్జున , బాలకృష్ణ మరియు వెంకటేష్ తో పాటు, నేటి తరం హీరోలైన ఎన్టీఆర్ , మహేష్ బాబు , ప్రభాస్ వంటి హీరోలతో సినిమాలు చేసింది. పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా నటించే ఛాన్స్ దక్కింది కానీ, చివరోయ్ నిమిషం లో చేజారింది. అలా కెరీర్ పీక్ రేంజ్ లోకి వెళ్తున్న సమయం లో హీరో తరుణ్ తో ప్రేమాయణం నడిపి, ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడం తో ఆర్తి అగర్వాల్ ఆత్మహత్యయత్నం కూడా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుండి ఆర్తి అగర్వాల్ కెరీర్ మొత్తం పోయింది.

ఇక ఆ తర్వాత ఆమె అమెరికా కి వెళ్లి అక్కడ ఇంట్లో వాళ్ళు కుదిరించిన పెళ్లిని చేసుకుంది. అతని పేరు ఉజ్వల్ కుమార్, చూసేందుకు మంచి బాలీవుడ్ హీరోలాగా అనిపిస్తాడు. అప్పట్లోనే అమెరికా లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసేవాడు. నెలకి రెండునుండి మూడు లక్షల రూపాయిల జీతం వచ్చేది. అయితే ఆర్తి అగర్వాల్ కి మళ్ళీ సినిమాల్లోకి రావాలని కోరిక పుట్టింది, కానీ అందుకు ఉజ్వల్కుమార్ ఒప్పుకోలేదు. దాని వల్ల వీళ్లిద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి, ఫలితంగా విడాకులు తీసుకున్నారు.

ఆ తర్వాత ఆర్తి అగర్వాల్ మళ్ళీ ఇండియా లోకి అడుగుపెట్టడం, సినిమాల్లో ట్రై చెయ్యడం, ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడం బరువు తగ్గాలనే ప్రయత్నం లో లైపో సర్జరీ చేయించుకొని, అది వికటించడం తో ఆమె తన ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఆర్తి అగర్వాల్ తో విడాకులు తీసుకున్న తర్వాత ఉజ్వల్ కుమార్ ముంబై కి చెందిన ఒక మోడల్ ని పెళ్లాడాడట. ప్రస్తుతం ఆమెతోనే జీవితం గడుపుతూ పిల్లల్ని కూడా కన్నాడట. ఒక ప్రముఖ MNC కంపెనీ ని మైంటైన్ చేస్తూ నెలకు కోట్ల రూపాయిలు సంపాదిస్తున్నాడు ఉజ్వల్ కుమార్.
