Aaradhya: ఇటీవల కాలం లో సోషల్ మీడియా ఎంత దారుణంగా తయారైందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ముఖ్యంగా యూట్యూబ్ లో వచ్చే వార్తల్లో 90 శాతం ఫేక్ వి ఉంటున్నాయి.ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ ఫేక్ న్యూస్ ప్రచారాలపై యూట్యూబ్ యాజమాన్యం ఇప్పటి వరకు సరైన యాక్షన్ తీసుకోలేదు.ఇక మా ఇష్టం అన్నట్టుగా నోటికి వచ్చిన వార్తలను ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నారు కొంతమంది యూట్యూబర్స్.
రీసెంట్ గా ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ మీద కూడా ఇలాంటి రూమర్స్ చాలా వచ్చాయి.ఆమెకి ఆరోగ్యం సరిగా లేదని, త్వరలోనే చనిపోబోతుంది అంటూ కొన్ని యూట్యూబ్ చానెల్స్ ఆరాధ్య బచ్చన్ పై ఫేక్ న్యూస్ ప్రచారం చేసింది.దీనిని చూసి తట్టుకోలేకపోయిన ఆరాధ్య బచ్చన్, తన పై వచ్చిన ఈ వార్తలపై ఫైర్ అయ్యిందట.
దీనితో వెన్తనె ఆమె హై కోర్టు ని ఆశ్రయించి ఆ యూట్యూబ్ చానెల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు చేసిందట.11 సంవత్సరాల మైనర్ బాలికను అయిన నాపై సోషల్ మీడియా లో చాలా నీచమైన ప్రచారాలు చేస్తున్నారని, తన ఆరోగ్యం పట్ల లేని పోనీ పుకార్లు పుట్టిస్తున్నారని, తక్షణమే ఆ చానెల్స్ పై కఠిన చర్య తీసుకోవాలంటూ ఆమె ఫిర్యాదు చేసిందట.
ఇంత చిన్న వయస్సు లో అసత్య ప్రచారాలపై ఆరాధ్య చేస్తున్న పోరాటం పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి ప్రశంసల వర్షం కురుస్తుంది.చిన్న పిల్ల అని కూడా చూడకుండా ఆమె మనస్సు ని నొచ్చుకునేలా చేసిన ఆ యూట్యూబ్ చానెల్స్ పై కచ్చితంగా చర్యలు తీసుకోవాలి అంటూ ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాధ్య కి మద్దతుగా సోషల్ మీడియా లో ట్రేండింగ్ చేస్తున్నారు ఫ్యాన్స్.