Aamani: ఆ తెలుగు హీరోతో ఎఫైర్.. అందుకే ఆమని భర్తకు డివోర్స్ ఇచ్చిందా ?

- Advertisement -

Aamani: సీనియర్ నటి ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పని లేదు. ఈ జనరేషన్ వాళ్లు కచ్చితంగా ఆమె సినిమాలు చూసే ఉంటారు. లేటెస్ట్ జనరేషన్ హీరోలకు తల్లి, అత్త వంటి పాత్రల్లో నటిస్తూ సినిమాల్లో యాక్టివ్ గా ఉంటుంది. అప్పట్లో ఆమని కృష్ణ, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, జగపతి బాబు, కమల్ హాసన్.. ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ఆమె అప్పట్లో కొంతమంది హీరోలతో ఎఫై** నడిపించినట్లు కూడా వార్తలు వినిపించాయి.

ఇక తన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే నిర్మాత ఖాజా మొయిద్దీన్ ను మతాంతర వివాహం చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఆ తరువాత ఆమె సినిమాల్లో కనిపించలేదు. ఇక 2003లో రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన మధ్యాహ్నం హత్యతో ఈమె తిరిగి రీఎంట్రీ ఇచ్చింది. ఆమె రీఎంట్రీలో కూడా అదరగొడుతుంది. కథా ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ మంచి పేరునే సంపాదించుకుంది. ఆమని జీవితంలో చాలామందికి తెలియని కొన్ని విషయాలు జరిగాయి. ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చింది. నిర్మాత అయిన ఖాజా మొయిద్దీన్ ఒకానొక సమయంలో సూసైడ్ అటెంప్ట్ చేశాడట. అది అప్పట్లో సంచలనంగా మారింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నలన్నింటికీ ఆమని సమాధానం ఇచ్చింది. తన భర్త సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించినట్లు ఆమని చెప్పుకొచ్చింది.

- Advertisement -

‘‘మా ఇద్దరి మధ్య పెద్ద గొడవలేమీ లేవు. ఆయన ఒక సినిమా తీసి బాగా నష్టపోయారు. కోట్లలో డబ్బులు కట్టాలి. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో నాకు ఆయనకు ఏం చెప్పాలో అర్ధం కాలేదు. అంతా సర్దుకుంటుందని చెప్పాను అంతే. ఇక ఆ ఘటన తరువాత రియల్ ఎస్టేట్ లో దిగి ఆయనే ఆ డబ్బు మొత్తాన్ని కట్టేశారు. ఇప్పుడు కోట్లు అంటే కామన్ .. అప్పట్లో కోట్లు ఆంటే మాములు విషయం కాదు. దానివల్ల మా ఇద్దరి మధ్య డివోర్స్ కాలేదు. ఫ్రెండ్లీగా విడిపోయాం. విడిగా ఉండాలనుకున్నాం.. విడిగా ఉంటున్నాం. నేను సినిమాల్లో మళ్లీ రావడం ఆయనకు ఇష్టం లేదు. నేను వస్తానని చెప్పి వచ్చేశాను. ఇప్పుడు నాకు రెండే ప్రపంచాలు. ఒకటి సినిమా.. ఇంకొకటి నా పిల్లలు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఆమని ఇంటర్వ్యూ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here