Aadikeshava Review ఉప్పెన సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని దాదాపుగా 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాడు పంజా వైష్ణవ్ తేజ్. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఏ డెబ్యూ హీరో కి కూడా ఈ స్థాయి వసూళ్లు రాలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ఆ చిత్రం తర్వాత వైష్ణవ్ తేజ్ చేసిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆయన రూట్ ని మార్చి పూర్తి స్థాయి ఊర మాస్ జానర్ ని ఎంచుకొని ‘ఆదికేశవ్’ సినిమాతో మన ముందుకు ఈరోజు వచ్చాడు. శ్రీలీల తో ఊర మాస్ డ్యాన్స్ స్టెప్పులు ఉన్న సాంగ్ తో పాటుగా, ఇప్పటి వరకు చూడని ఓవర్ మాస్ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమాని తీసినట్టుగా ట్రైలర్ ని చూస్తే అర్థం అవుతుంది. మరి పూర్తి సినిమా ఎలా ఉందో ఈ రివ్యూ లో చూద్దాం.

కథ :
బాలు (వైష్ణవ్ తేజ్) ఆకతాయిగా తిరిగే ఒక యువకుడు. కానీ ఇతనికి సమాజం మీద చాలా ప్రేమ ఉంటుంది. చిన్నపిల్లలకు బాధను కలిగించినా, ఆడపిల్లలపై అత్యాచారాలు వంటివి చేసినా అసలు సహించని మనస్తత్వం ఆయనది. అయితే తల్లితండ్రులు (రాధికా శరత్ కుమార్, జయప్రకాష్) కోరిక మేరకు ఒక కాస్మటిక్ కంపెనీ లో చేరేందుకు అప్లై చేస్తాడు. ఆ కంపెనీ సీఈవో చిత్ర (శ్రీలీల) ఇతన్ని ఇతన్ని ఇంటర్వ్యూ లో సెలెక్ట్ చేసి కంపెనీ లో పెట్టుకుంటుంది. ఆ తర్వాత బాలు మనస్తత్వం బాగా నచ్చి అతనితో ప్రేమలో పడుతుంది.
చిత్ర పుట్టిన రోజు వేడుకలో ఆమె తండ్రి మాత్రం అదే కంపెనీ లో పనిచేసే వేరే యువకుడిని ఇచ్చి పెళ్లి చెయ్యాలని అనుకుంటాడు. అదే వేడుక లో బాలు కి వార్నింగ్ ఇవ్వడానికి రౌడీలను కూడా పిలిపిస్తాడు. అలా రాయలసీమ కి చిత్ర కోసం వెళ్లిన బాలుకి బ్రహ్మపురం లో అక్రమంగా మైనింగ్ చేస్తున్న చెంగా రెడ్డి తో వైరం మొదలు అవుతుంది. వీళ్లిద్దరికీ గొడవలు జరగడానికి అసలు కారణం ఏమిటి?, చివరికి ఏమైంది అనేదే సినిమా స్టోరీ.

విశ్లేషణ :
డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి కి ఇది మొట్టమొదటి సినిమా. ఎంచుకున్న పాయింట్ బాగానే ఉంది కానీ, స్క్రీన్ ప్లే ని నడిపించిన విధానం బాగాలేదు. కేవలం ఆయన ఈ చిత్రాన్ని కామెరికాల్ ఆడియన్స్ కోసం మాత్రమే తీసినట్టుగా అనిపించింది. అదే సమయం ఆయన స్క్రిప్ట్ మీద కూడా పెట్టి ఉంటే ఈరోజు వైష్ణవ్ తేజ్ కి పెద్ద హిట్ వచ్చి ఉండేది. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో హీరోయిన్ మధ్య ఉన్న కెమిస్ట్రీ ని చూస్తే మనకి ‘అలా వైకుంఠపురం లో’ చిత్రం లోని ఆఫీస్ సన్నివేశాలు గుర్తుకు వస్తాయి.
అలా ఎక్కడో చూసినట్టుంది అని అనిపించినా కానీ వినోదాత్మకంగా కథని నడిపించడం లో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఓవర్ ఫైట్స్ కి పరాకాష్ట లాగ మారింది ఈ సినిమా. బోయపాటి శ్రీను ఇది వరకు మనకి చూపించిన యాక్షన్ సన్నివేశాలు వేరు.

ఈ సినిమాలో శ్రీకాంత్ రెడ్డి చూపించిన యాక్షన్ సన్నివేశాలు వేరు. బోయపాటి కూడా ఆశ్చర్యపోయే రేంజ్ మాస్ ఫైట్స్ ని పెట్టాడు ఇందులో. చేతికి దొరికిన వస్తువుతో ఇష్టమొచ్చినట్టు రకరకాలుగా చంపుతుంటాడు హీరో. ఇక చివరి 20 నిమిషాలు అయితే రొటీన్ కమర్షియల్ మూవీస్ ని ఇష్టపడే ఆడియన్స్ కి బాగా నచ్చుద్ది కానీ, మిగతా వాళ్ళను థియేటర్ నుండి పారిపోయేలా చేస్తుంది. అంత ఊర మాస్ సన్నివేశాలు అన్నమాట. ఇక నటీనటుల విషయానికి పంజా వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో కమర్షియల్ హీరో గా పనికొస్తానని నిరూపించుకున్నాడు.
మంచి సబ్జెక్టు దొరికితే దుమ్ము లేపేస్తాడు. ఇక శ్రీలీల ఈ సినిమాకి మెయిన్ హైలైట్, ఆమె వేసిన డ్యాన్స్ స్టెప్పులు అదిరిపోయాయి. అలాగే మలయాళం స్టార్ హీరో జోజు జార్జ్ ని ఈ సినిమాలో ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు. చాలా రొటీన్ విలన్ పాత్ర కి ఆయన కూడా ఎలా ఊపుకున్నాడో ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఇక జీవీ ప్రకాష్ కుమార్ అందించిన పాటలు పర్వాలేదు అనిపించే రేంజ్ లో ఉన్నాయి.
చివరిమాట :

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను కాసేపు టైం పాస్ కోసం ఎంజాయ్ చేసే వాళ్ళు ఈ సినిమాకి వెళ్ళండి. మిగతా ఆడియన్స్ దూరంగా ఉండొచ్చు .
నటీనటులు: వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జి, రాధిక శరత్ కుమార్, సుమన్, జయప్రకాశ్, సుదర్శన్, అపర్ణా దాస్, సద తదితరులు
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం: డడ్లీ
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఎన్ రెడ్డి
నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశి, సాయి సౌజన్య
విడుదల: నవంబర్ 24, 2023
రేటింగ్ : 2/5