Aadikeshava : మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆదికేశవ’ రీసెంట్ గానే గ్రాండ్ గా విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. చిన్న వయస్సు లో ఇలాంటి చెత్త సినిమాలు చేసి కెరీర్ ని సర్వ నాశనం చేసుకుంటున్నాడు అంటూ వైష్ణవ్ తేజ్ పై మెగా ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ కలిగించే విషయం ఏమిటంటే వైష్ణవ్ మొదటి చిత్రం ‘ఉప్పెన’ కి మొదటి రోజు దాదాపుగా 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
కానీ ‘ఆది కేశవ్’ చిత్రానికి కనీసం కోటి రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాలేదు. దీనిని బట్టీ వైష్ణవ్ తేజ్ గ్రాఫ్ ఏ రేంజ్ లో పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఉప్పెన తర్వాత కెరీర్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని ఉంటే వైష్ణవ్ తేజ్ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగేవాడు.
ఇది ఇలా ఉండగా విడుదలై కనీసం రెండు రోజులు కూడా పూర్తి అవ్వలేదు. అప్పుడే ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు బయటకి వచ్చేసాయి. ఈ సినిమా ని విడుదలకు ముందు ఫ్యాన్సీ రేట్ కి అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసిందట. సినిమాకి అట్టర్ ఫ్లాప్ కలెక్షన్స్ రావడం తో ముందు అనుకున్న తేదీ కంటే విడుదల చేసుకునే అవకాశం ఇస్తే ఎక్కువ డబ్బులు ఇస్తామని ఆఫర్ పెట్టడం తో డిసెంబర్ రెండవ వారం లో విడుదల చేసుకునేందుకు అనుమతిని ఇచ్చాడట డైరెక్టర్ వంశీ.
అలా విడుదలైన రెండు రోజులకే ఓటీటీ వివరాలు వచ్చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుతం థియేటర్స్ లో నడుస్తున్న ఈ చిత్రానికి కనీసం రెండు కోట్ల రూపాయిలు కూడా వచ్చేలా కనిపించడం. 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి 8 కోట్లు నష్టం వాటిల్లే ఛాన్స్ ఉందని అంటున్నారు.