Aadikeshava First Review : మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ‘ఉప్పెన’ చిత్రం తో ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడా మనమంతా చూసాము. ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా అలాగే, క్లోసింగ్ కలెక్షన్స్ పరంగా డెబ్యూ హీరోస్ చిత్రాలలో ఆల్ టైం రికార్డు ని నెలకొల్పింది. ట్రేడ్ పండితుల అంచనా ప్రచారం ఆ చిత్రం 60 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు సాధించాయి.

ఈ సినిమా తర్వాత వచ్చిన వైష్ణవ్ రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఆయన ఈ నెల 24 వ తేదీన ‘ఆది కేశవ్’ అనే చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రీసెంట్ గానే విడుదల చేసారు. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ సభ్యుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఈ రివ్యూ లో చూద్దాం.

ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు, ఫస్ట్ హాఫ్ ఒక జానర్ గా, సెకండ్ హాఫ్ మరో జానర్ గా ఉందని చెప్పుకొచ్చారట. ఫస్ట్ హాఫ్ మొత్తం శ్రీలీల తో లవ్ ట్రాక్ మరియు ఆమెతో రొమాన్స్ సన్నివేశాలతో అలా సరదాగా సాగిపోతుంది అట. కానీ ఇంటర్వెల్ నుండి సినిమా థీమ్ మొత్తం మారిపోయిందని అంటున్నారు. ఓవర్ మాస్ సన్నివేశాలు ఎక్కువ అయిపోయాయి అని , ఇలాంటి సన్నివేశాలు ఇప్పటి వరకు చూడలేదని చెప్పుకొచ్చారట.

వైష్ణవ్ తేజ్ రేంజ్ కి ఈ స్థాయి మాస్ సన్నివేశాలు చాలా ఎక్కువ అని, ఆయనకీ సూట్ అవ్వలేదని కూడా చెప్తున్నారు. ఆడియన్స్ ఈ మాస్ సన్నివేశాలను తీసుకోగలిగితే ఈ సినిమా హిట్ అవుతుందని, లేకపోతే వైష్ణవ్ కెరీర్ లో మరో డిజాస్టర్ ఫ్లాప్ తప్పదని అంటున్నారు. మరి ఆడియన్స్ నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.