Adha Sharma : 45రోజుల పాటు నరకం అనుభవించానన్న ఆదా శర్మ.. అయ్యో అంటున్న అభిమానులు

- Advertisement -

Adha Sharma : యంగ్ బ్యూటీ అదా శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఒకప్పుడు వరుసగా సినిమాల్లో నటించింది. కానీ ఊహించిన రేంజ్ లో సక్సెస్ రాలేదు. అయినప్పటికీ ఈ అమ్మడి క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో గతేడాది.. అదాశర్మ నటించిన.. ది కేరళ స్టోరీ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవ‌డంతో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించి భారీగా పాపులారిటీ దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమాతో సక్సెస్ అందుకుంది. దీంతో ఆదాకు వరుస ఆఫర్లు రావడం మొదలయ్యాయి. రెండు వైవిధ్యమైన కథలను ఎంచుకున్న నటించిన ఈ అమ్మడు కెరీర్లో బ్లాక్ బస్టర్ సక్సెస్లను సొంతం చేసుకుంది.

ఇక ప్రస్తుతం బార్ సినిమాలో డ్యాన్సర్‌గా మెప్పించనుంది. ఈ క్రమంలో ఇంటర్వ్యూలో పాల్గొన్న అదా తనకు అరుదైన వ్యాధి ఉందంటూ అభిమానులకు షాక్ ఇచ్చింది. ఆ సమస్య కూడా సినిమాల వల్లే ఏర్పడిందంటూ చెప్పుకొచ్చింది. ది కేరళ స్టోరీ మూవీలో ఓ కాలేజ్ అమ్మాయిల కనిపించాలని ఎంతగానో శ్రమించిందట. లుక్ కోసం భారీగా బరువు తగ్గాల్సి వచ్చింది అంటూ చెప్పింది. తర్వాత బస్తర్ ది నక్సల్ స్టోరీ కోసం మరింత బరువు పెరగాల్సి వచ్చిందట.. బరువైన గన్‌లు మోయాలి.. అలాగే దానిని బ్యాలెన్స్ చేసే విధంగా శరీరం కనిపించాలి.. దీంతో బలంగా ఉండడానికి 10 నుంచి 12 వరకు అరటిపండు తినేదాన్ని అంటూ అమ్మడు వివరించింది.

- Advertisement -

అలానే గింజలు, డ్రై ఫ్రూట్స్, ఫ్లెక్స్ సీడ్స్ ఉన్న లడ్డులను ఎక్కడికి వెళ్లినా క్యారీ చేసేదట. నిద్రపోయే గంట ముందు రెండు లడ్డులు తినే దాన్ని అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు బార్ సినిమా కోసం మళ్లీ బరువు తగ్గాల్సి వచ్చింది. ఇలా నెల‌ల వ్యవధిలో శరీరంలో మార్పు రావడంతో అనారోగ్యానికి గురయ్యా. ఎండోమెట్రియోసిస్ వ్యాధి బారిన పడాల్సి వచ్చింది. దీనివ‌ల్ల పీరియడ్స్ నాన్ స్టాప్ గా కొనసాగుతాయని.. దీంతో దాదాపు 48 రోజుల పాటు ఆగకుండా వచ్చే పీరియడ్స్‌తో ఎంతో ఇబ్బంది పడ్డానంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అదా చేసిన కామెంట్స్ నెటింట్లో వైరల్ అవ్వడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇంత శ్రమించి ఆరోగ్యమే రిస్క్లో పెట్టి మరి ఇలాంటి డైట్లు ఫాలో అవ్వడం అవసరమా అంటూ.. తరచూ శరీర మార్పులు కాకుండా మీకు సెట్ అయ్యే సినిమాలను చేయొచ్చుగా అంటున్నారు నెటిజన్లు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com