Mani Sharma : సినిమా ఇండస్ట్రీ లో ఎంత పెద్ద స్టార్ అయినా, ఎంత అద్భుతమైన టాలెంట్ ఉన్నా, అవకాశాలు సంపాదించాలంటే కచ్చితంగా సక్సెస్ స్ట్రీక్ లో ఉండాలి. లేకపోతే ఎంత సూపర్ స్టార్ కి అయినా విలువ ఉండదు. ఆచార్య తర్వాత చిరంజీవి ని, జైలర్ కి ముందు రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్స్ నే ట్రేడ్ తక్కువ అంచనా వేసింది. ఇక మిగిలిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.

ఇప్పుడు ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ కూడా అదే పరిస్థితి లో ఉన్నాడు. ఈయన తన కెరీర్ లో మూడు జనరేషన్ స్టార్ హీరోలను కవర్ చేసాడు. కానీ ఇప్పుడు ఒక్క చిన్న అవకాశం కోసం ఎదురు చూసే పరిస్థితి కలిగింది. రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన పరిస్థితి గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

ఆయన మాట్లాడుతూ ‘ఒకప్పుడు పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు నన్ను ప్రతీ సినిమాకి పెట్టుకునే వాళ్ళు. పవన్ కళ్యాణ్ ‘గుడుంబా శంకర్’ మరియు ‘ఖుషి’ పాటలను కంపోజ్ చేసేటప్పుడు నా పక్కనే ఉండేవాడు. ఇద్దరం కలిసి సాంగ్స్ ని తయారు చేసేవాళ్ళం. పాటల్ని వింటూ డ్యాన్స్ కూడా చేసేవాళ్ళం. ఇక మహేష్ బాబు అయితే హిట్/ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ప్రతీ సినిమాకి నన్ను పెట్టుకునేవాడు. మా ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం ‘ఖలేజా’. ఈ సినిమా తర్వాత ఎందుకో ఆయన నాకు మళ్ళీ పని చేద్దాం అని ఫోన్ చెయ్యలేదు. ఏమైందో ఏమో మరి. దయచేసి సక్సెస్ రేట్ ని చూసి మా లాంటి స్కిల్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ ని పక్కన పెట్టకండి. మా టాలెంట్ ని గుర్తించి మాత్రమే అవకాశాలు ఇవ్వండి’ అంటూ మణిశర్మ ఈ సందర్భంగా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
