Big Boss : ఈ ఏడాది బిగ్ బాస్ సరికొత్త సీజన్ మొదటి ఎపిసోడ్ నుండే ఏ రేంజ్ రెస్పాన్స్ ని అందుకొని ముందుకు దూసుకుపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. కంటెస్టెంట్స్ అందరూ మొదటి ఎపిసోడ్ నుండే అద్భుతంగా ఆడుతూ విశ్వరూపం చూపించేసారు. ఇక ఈ సీజన్ లో ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకర్షించింది ‘పవర్ అస్త్ర’ టాస్క్. ఈ టాస్క్ లో గెల్చిన వాళ్లకి నామినేషన్స్ నుండి ఇమ్మ్యూనిటీ వస్తుంది. ఈ టాస్కు ఎంతో ఆసక్తికరంగా ఉండడం తో రేటింగ్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వచ్చాయి.

ఇక ఇప్పటి వరకు ఈ బిగ్ బాస్ హౌస్ నుండి కిరణ్,షకీలా, దామిని మరియు రతికా ఎలిమినేట్ అయ్యారు. ఇక వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళడానికి నామినేట్ అయ్యేవాళ్ళు ఎవరో రేపు తెలుస్తుంది. ఇకపోతే ఈ వారం చాలా సర్ప్రైజ్ లు ఉండబోతున్నాయని నాగార్జున హింట్ ఇచ్చేసాడు.

వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా 5 నుండి 7 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. వీరిలో అలనాటి యూత్ ఐకాన్ అబ్బాస్ కూడా ఉన్నాడట. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయనతో పాటుగా సీనియర్ నటుడు పృద్వి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. పృద్వి అంటే ‘సమర సింహా రెడ్డి ‘ చిత్రం లో బాలకృష్ణ తమ్ముడి పాత్రలో కనిపించిన ‘వాసు ‘ అనే పాత్ర గుర్తుంది కదా, అతనే.

ఈ ఇద్దరితో పాటు సీరియల్ హీరో అర్జున్ అంబటి, యాంకర్ ప్రత్యూక్ష, అంజలి పవన్ వంటి వారు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు టాక్. వీరితో పాటు మూడవ వారం ఎలిమినేట్ అయిన దామిని కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఇలా ఈ వారం ఎన్నో ఊహించని ట్విస్టులు ఉండబోతున్నాయట.
