Sridevi : అతిలోక సుందరి శ్రీదేవికి దక్కిన అరుదైన గౌరవం.. కలకాలం గుర్తుండిపోతుంది

- Advertisement -

Sridevi : దివంగత నటి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. బాలనటిగా సినిమాల్లోకి ప్రవేశించి.. తాను చనిపోయే వరకు అనేక సినిమాలలో తన అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించింది. బ్యూటీ క్వీన్ శ్రీదేవి మరణాన్ని నేటికి జీర్ణించుకోలేని ఆమె అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అటువంటి శ్రీదేవికి మరో అరుదైన గౌరవం దక్కింది.

ముంబైలోని అంధేరీ వెస్ట్ ప్రాంతంలో ఉన్న లోఖండ్ వాలా కాంప్లెక్స్ లోని ఒక జంక్షన్ కి అక్కడి ప్రజలు అతిలోక సుందరి శ్రీదేవీ పేరు పెట్టారు. దానికి వారు శ్రీదేవి కపూర్ చౌక్ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. ఈ మేరకు అక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేసింది. అయితే, గతంలో ఇదే ప్రాంతంలోని గ్రీన్ ఎకర్స్ టవర్‌లో శ్రీదేవి కుటుంబం నివసించడంతోనే స్థానికులు ఆమె పేరు పెట్టారు.

- Advertisement -
sridevi janhvi kapoor
sridevi-janhvi kapoor

శ్రీదేవి, బోనీ కపూర్‌తో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లు ఇక్కడే నివసించే వారిని, శ్రీదేవి మరణించిన అనంతరం అక్కడి నుంచి వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయ్యారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. కాగా, గతంలో శ్రీదేవి జ్ఞాపకార్ధం ముంబైలో ఓ ఫ్లై ఓవర్‌కి ‘అభినేత్రి శ్రీదేవి ఉదాన్‌పూల్’ అని పేరు పట్టాలని బీజేపీ నేత మోగిరాజ్ లేఖ రాశారు. కాగా, చెన్నైలో పుట్టిన శ్రీదేవి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ లాంటి బాషల్లో నటించి ఇండస్ట్రీలోనే తిరుగులేని స్టార్‌గా ఎదిగింది. తన అందం, అద్భుతమైన నటనతో అతిలోక సుందరిగా అభిమానుల హృదయాల్లో నిలిచింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here