Jabardasth Faima : పెళ్లెప్పుడు అని అడిగిన నెటిజన్.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ఫైమా

- Advertisement -

Jabardasth Faima : జబర్దస్త్ షో గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎంత బాధలో ఉన్నా రిలీఫ్ కోసం జబర్ధస్త్ చేసే వాళ్లు చాలా మంది ఉన్నారు. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడీయన్లు పరిచయం అయ్యారు. ప్రస్తుతం బుల్లితెర, వెండితెరపై తమ ప్రతిభను చాటుతున్నారు. అలా జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరపై ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న వారిలో లేడీ కమెడీయన్ జబర్దస్త్ ఫైమా కూడా ఒకరు. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Jabardasth Faima
Jabardasth Faima

తొలుత ఈటీవీలో ప్రసారం అయిన పటాస్ షో ద్వారా బుల్లితెరకు పరిచయం అయింది. కానీ జబర్దస్త్‌తోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాకుండా బిగ్‌బాస్ షోలో కూడా కంటెస్టెంట్‌గా పాల్గొంది. తన ఆటతీరుతో అందరినీ అలరించింది. హౌసులో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంది కానీ విన్నర్ కాలేకపోయింది. ముఖ్యంగా సూర్యతో బీబీ డ్యాన్స్ షోలో పాల్గొని విన్నర్ గా నిలిచింది. అలాగే సోషల్ మీడియాలోనూ పలు పోస్టులు పెడుతూ ఫాలోవర్స్‌ను రోజురోజుకు పెంచుకుంటుంది. అయితే ఫైమా పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ప్రవీణ్ తో లవ్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

- Advertisement -

కానీ షాకింగ్ గా ఫైమా కొత్త బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసింది. ఇటీవల తన బర్త్ డే సందర్భంగా ఐదేళ్ల నుంచి రిలేషన్‌షిప్ కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో జనాలు షాకయ్యారు. అలాగే ప్రవీణ్ ను మోసం చేసిందని తిట్టిపోశారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఫైమా ఇన్‌స్టా వేదికగా చిట్‌చాట్ నిర్వహించింది. అయితే అందులో ఓ నెటిజన్.. ‘అక్కా మీ పెళ్లి ఎప్పుడు’ అని ప్రశ్నించాడు. దీనికి ఫైమా తెలివిగా పెళ్లి జరిగినప్పుడే అంటూ దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చింది. కానీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలిసిన వారు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here