Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేసే అవకాశం వస్తే ఏ డైరెక్టర్ మాత్రం వదులుకుంటాడు చెప్పండి?..ముఖ్యంగా చిన్నతనం నుండి ఆయన సినిమాలను చూస్తూ, ఆయన్ని విపరీతంగా ఆరాధిస్తూ పెరిగిన యంగ్ డైరెక్టర్స్ కి చిరంజీవి తో సినిమా అవకాశం రావడం అనేది ఒక వరం లాంటిది. సినిమా ఫలితం ఎలా ఉంటుంది ఏమిటి అనేది పక్కన పెడితే ఆయనతో కలిసి ప్రయాణం చేస్తే చాలు అనుకుంటారు నేటి తరం యంగ్ డైరెక్టర్స్.
ఉదాహరణకి ఈ ఏడాది ప్రారంభం లో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి ముందు చిరంజీవి కి రెండు డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. ఆ సమయం లో బాబీ అనే వీరాభిమానిని నమ్మాడు, 140 కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టాడు. ఈ సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్స్ తోనే సినిమా చెయ్యాలని అనుకున్నాడు మెగాస్టార్.
అందులో భాగంగానే హిట్ సిరీస్ దర్శకుడు శైలేష్ కొలను పని తీరు బాగా నచ్చి అతనిని ఇంటికి పిలిచి తన కోసం కథ రాయమని గత ఏడాదే చెప్పాడట. అనేక ఇంటర్వూస్ లో శైలేష్ మెగాస్టార్ తో సినిమా చెయ్యడమే నా జీవిత లక్ష్యం అని చెప్పుకున్నాడు. అలాంటిది చిరంజీవే పిలిచి అవకాశం ఇవ్వడం తో అతని ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. అయితే అప్పటికే ఆయన వెంకటేష్ తో ‘సైన్డప్’ అనే చిత్రానికి కమిట్ అయ్యి ఉన్నాడు.
ఈ సినిమా తర్వాత వెంటనే చిరంజీవి గారి సినిమా అని అనుకున్నాడు. ‘భోళా శంకర్’ తర్వాత శైలేష్ ని మరోసారి ఇంటికి పిలిచి, ‘ఏంటి..కథ రెడీనా’ అని అడిగాడట చిరంజీవి. మరో ఆరు నెలలు సమయం ఇవ్వాల్సిందిగా చిరంజీవి ని కోరాడట. తీస్తే చిరంజీవి తో చరిత్ర లో నిలిచిచిపోయే సినిమా తియ్యాలి అనేది అతని జీవిత లక్ష్యం. అందుకే సమయం కోరాడు, చిరంజీవి అంత సమయం వేచి చూడలేక వసిష్ఠ తో ‘విశ్వంభర’ చిత్రాన్ని ప్రారంభించాడు. ఇది జరిగిన విషయం.