Bigg Boss : బిగ్ బాస్ తెలుగు హిస్టరీ లోనే ఈ ప్రస్తుతం నడుస్తున్న సీజన్ ది బెస్ట్ అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆడియన్స్ ఈ షో ని ఎంతో ఆసక్తికరంగా చూస్తున్నారు. ప్రతీ రోజు రాత్రి 9 గంటల 30 నిమిషాలు అయితే చాలు, ఎన్ని పనులు ఉన్నా మానుకొని మరీ టీవీ ముందు కూర్చుంటున్నారు ఆడియన్స్. కంటెస్టెంట్స్ మధ్య వచ్చే వాదనలు, వాగ్వివాదాలతో పాటుగా గేమ్ ని ప్రతీ ఒక్కరు సవాలు గా తీసుకొని ఆడడం అందరికీ బాగా నచ్చింది.
అందుకే ఈ సీజన్ అంత పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సీజన్ ప్రారంభం అయ్యి 10 వారాలు పూర్తి అయ్యి 11 వ వారం లోకి అడుగుపెట్టింది. ఇప్పటి నుండి ఆట మరింత రసవత్తరంగా సాగనుంది. హౌస్ లో దాదాపుగా వీక్ కంటెస్టెంట్స్ అందరూ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు.
ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ కి వస్తున్న రెస్పాన్స్ ని చూసి మరో రెండు వారాలు పొందించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కరెక్ట్ గా 10 మంది ఉన్నారు. ఈ పది మందిలో 5 మంది కంటెస్టెంట్స్ రాబొయ్యే 5 వారాల్లో ఎలిమినేట్ అవ్వబోతున్నారు. సరిగ్గా సరిపోతుంది కదా మళ్ళీ రెండు వారాలు ఎలా పొడిగిస్తారు అని ఆలోచిస్తున్నారు ఆడియన్స్.
ఈ సీజన్ మొత్తం ‘ఉల్టా పల్టా’ అని మన అందరికీ తెలిసిందే. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు, అందుకే త్వరలోనే సందీప్ మరియు టేస్టీ తేజా రీ ఎంట్రీ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇది ఎంత మాత్రం నిజమో తెలియదు కానీ, ఒకవేళ నిజం అయితే ఆడియన్స్ కి పండగే అని చెప్పొచ్చు. చూడాలి మరి ఏమి జరగబోతుందో. ప్రస్తుతానికి అయితే రెండు వారాల పొడిగింపు చర్చల దశలోనే ఉన్నాయట.