Trisha : తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ చెన్నై బ్యూటీ త్రిష అనారోగ్యానికి గురైంది.. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ కోసం కాశ్మీర్ వెళ్ళింది. అక్కడ గత కొన్ని రోజులుగా అక్కడే ఉంటూ షూటింగ్ కు వెళ్తుంది.. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో తీవ్ర జ్వరానికి గురైనట్లు తెలుస్తుంది..

దాంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది.. నీ మనసు నాకు తెలుసు అనే సినిమా ద్వారా టాలివుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైన త్రిష ప్రెసెంట్ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది .ఈమె కేరీర్ మొదట్లో వరుస సినిమా తో బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు..
మొన్నటి వరకు అవకాశాలు లేక అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చిన త్రిష గత ఏడాది మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా ఓవర్ నైట్ లోనే మరొకసారి తన ఇమేజ్ ను పెంచుకుంది..ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో వరుసగా ఇప్పుడు ఈమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే హీరో విజయ్ తాజాగా నటిస్తున్న చిత్రం లియో ఈ సినిమాకు లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నారు..

ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్లో జరుగుతుంది . అక్కడ ప్రజెంట్ క్లైమేట్ ఎలా ఉందో మనందరికీ తెలిసిందే . భారీ మంచు కురుస్తూ కాళ్ళు బయట పెట్టలేని పొజిషన్లో జనాలు ఉన్నారు . కానీ షెడ్యూల్ ప్రకారం షూట్ కంప్లీట్ చేయాలని అక్కడికి వెళ్లిన చిత్ర బృందం కాశ్మీర్ లో ఇరుక్కుపోయింది . కాలు బయట పెట్టలేని పరిస్థితులో సినిమా యూనిట్ ఉంది.
ఈ క్రమంలోని ఎంత త్వరగా షూటింగ్ పూర్తి చేసుకొని చెన్నైకి వచ్చేయాలని ఆలోచిస్తుంది చిత్ర యూనిట్.. అక్కడ చలికి తట్టుకోలేక స్టార్ హీరోయిన్ త్రిష కు జ్వరం వచ్చినట్టు తెలుస్తుంది . దీంతో ఆమె స్పృహ తప్పి పడిపోయిన్నట్లు అక్కడ నుంచి సమాచారం అందుతుంది . ఈ క్రమంలోనే హుటాహుటిన హాస్పిటల్ కి తరలించిన మేకర్స్ ఆమెను ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారట.. ఆమె ప్రస్తుతం చెన్నైకి వచ్చేసినట్లు తెలుస్తుంది.. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆమె ఆరోగ్యం అప్డేట్ ఇవ్వాలని కోరుతున్నారు.. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..