Rakesh: రాకింగ్ రాకేష్ జబర్దస్త్ స్టేజిపై తనదైన పంచులు వేస్తూ.. మంచి కమెడియన్ గుర్తింపు తెచ్చుకున్నాడు.. రాకింగ్ రాజేష్ జోర్దార్ సుజాత కి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు. రాకింగ్ రాకేష్ జబర్దస్త్ తో ఫేమస్ అయితే.. సుజాత బిగ్ బాస్ తో ఫేమస్ అయింది.. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతోంది..

రాకింగ్ రాకేష్ స్కిట్లలో సుజాత చేయడం వల్ల ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ప్రేమగా మారింది. మొదట్లో రాకేష్ సుజాత ఇద్దరు కూడా మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ అందరినీ బుకాయించరు. ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని వాళ్ళ ప్రేమని వాళ్లే బయటపెట్టారు.
స్టేజి పైనే హగ్గులు, ముద్దులు ఇచ్చుకోవడంతో వారి వారు ఒకరినొకరు ఇష్టపడుతున్న విషయాన్ని వారే అఫీషియల్ గా కన్ఫామ్ చేశారు. ఇక ఇటీవల రాకేష్ సుజాత ఇద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కాగా రాకింగ్ రాకేష్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జబర్దస్త్ తో ఫేమస్ అయిన రాకేష్ ఈ షో కి వచ్చిన మొదట్లో ఓ బుల్లితెర నటిని ప్రేమించాడు .ఆమెకు కూడా రాకేష్ అంటే చాలా ఇష్టం కాకపోతే ఇద్దరి కులాలు వేరు కావడంతో వాళ్ల పెళ్లికి ఇంట్లో వాళ్ళు అడ్డు చెప్పారట.

అప్పటినుంచి వాళ్ళిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఆ తరువాత రాకేష్ కు సుజాత పరిచయం కావటం.. స్నేహం కాస్త ప్రేమగా మారడం తో ఈ జంట ఒకటయ్యారు.. రాకేష్ ముందుగానే ఓ బుల్లితెర నటిని ప్రేమించాడని సంగతి సుజాతకు చెప్పావా లేదా అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా సరే రాకేష్ సుజాత ఎంత ప్రేమగా ఉంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం.. ఈ జంట త్వరలోనే మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానుంది.