Indra : థియేటర్ లో అభిమానులతో కలిసి ‘ఇంద్ర’ సినిమా చూడబోతున్న చిరంజీవి..? రీ రిలీజ్ గురించి సెన్సేషనల్ అప్డేట్!

- Advertisement -

Indra : మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా ఆయన కెరీర్ ని ఎలాంటి మలుపు తిప్పిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వరుస ఫ్లాప్స్ వస్తున్న సమయంలో వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఇప్పటికీ కూడా ఈ సినిమాకి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. టీవీ టెలికాస్ట్ లో రీసెంట్ గా బంపర్ రెస్పాన్స్ ని దక్కించుకున్న పాత సినిమాలలో ఒకటి ఈ చిత్రం. అలాంటి బ్లాక్ బస్టర్ ని చిత్రాన్ని చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 22 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదలయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ నుండే ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Indra
Indra

నైజాం ప్రాంతం లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 50 లక్షలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. విడుదల రోజు కౌంటర్ బుకింగ్స్ చేసుకొని వెళ్లే ఆడియన్స్ సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొదటి రోజు నైజాం ప్రాంతం లో కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇకపోతే లండన్ లో ఈ చిత్రానికి అప్పుడే 15 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయట. రీ రిలీజ్ చిత్రాలలో ఇది ఆల్ టైం రికార్డు అని చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఓవరాల్ గా ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని చూస్తూ ఉంటే ఇంద్ర చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Indra 4k : రిలీజ్‌పై క్లారిటీ వచ్చింది ! | vyjayanthi movies clarified the rerelease of indra movie krkk-MRGS-Chitrajyothy

- Advertisement -

అదేమిటంటే మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రాన్ని అభిమానులతో కలిసి హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సుదర్శన్ థియేటర్ లో చూడబోతున్నాడని తెలుస్తుంది. ఇన్నేళ్ల ఆయన సుదీర్ఘ సినీ కెరీర్ లో స్టార్ అయ్యాక మెగాస్టార్ చిరంజీవి ఇలా అభిమానులతో కూర్చొని సినిమా చూసినట్టు చరిత్రలో లేదు. మొట్టమొదటిసారి ఆయన తన కొత్త సినిమాకి కాకుండా ఇంద్ర లాంటి పాత సినిమా రీ రిలీజ్ కి చెయ్యబోతున్నాడు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన బయటకి రావాల్సి ఉంది.

Megastar Chiranjeevi's Indra Rerelease Date Confirmed

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here