Journalist Murthy : నిత్యం వివాదాస్పద జాతకాలు చెప్తూ సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో ఉండే వేణు స్వామి, నిన్న సాయంత్రం తన భార్య శ్రీవాణి తో కలిసి మేము ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నాము అంటూ చేసిన వీడియో సంచలనం గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి నాపై 2017 వ సంవత్సరం నుండి పగబట్టాడని, నన్ను నాశనం చెయ్యడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడని, అతను అడిగినంత డబ్బులు నేను ఇవ్వలేదని గత 8 నెలల నుండి నాపై విష ప్రచారాలను , కథనాలను తన ఛానల్ లో ప్రసారం చేస్తున్నాడని, ఆయన టార్చర్ భరించలేక, సరిగా ఆహారం కూడా తీసుకోలేకపోతున్నాని, అందువల్ల నేను 15 కిలోల బరువు కూడా తగ్గాను అంటూ ఆయన చేసిన ఆరోపణలను చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
ఆ తర్వాత శ్రీవాణి మాట్లాడుతూ మమ్మల్ని 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని, అంత డబ్బులు నా నగలు, నా కూతురు నగలు మొత్తం అమ్మేసినా 5 శాతం కూడా సమకూరదని, గత వారం రోజుల నుండి అయితే మమ్మల్ని విపరీతంగా టార్చర్ చెయ్యడం మొదలు పెట్టారని చెప్తూ ఆమె ఒక ఆడియో ని విడుదల చేసింది. దీనికి మూర్తి వెంటనే స్పందించి నిన్న రాత్రి ఒక పెద్ద లైవ్ షో ని ఏర్పాటు చేసాడు. వేణుస్వామి తనపై చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ ‘నేను జర్నలిజం లో మూడు దశాబ్దాల నుండి ఉన్నాను. నేను నా యాజమాన్యాలు ఇచ్చిన డబ్బులు తప్పిస్తే, మిగతా ఎక్కడైనా నేను డబ్బులు డిమాండ్ చేసినట్టు చూపిస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపేయొచ్చు’ అంటూ ఆయన సవాలు విసిరాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ప్రభుత్వం చేస్తున్న కొన్ని అవాంచనీయ కార్యక్రమాలను కవర్ చేస్తూ స్టోరీ చేసినందుకు నా మీద దేశ ద్రోహి అనే కేసు పెట్టారు. ఆ కేసు కారణంగా నా మొబైల్ నెంబర్ పై ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాల నిఘాలు ఉన్నాయి, కావాలంటే నా ఫోన్ ని ట్యాప్ చేసుకోవచ్చు. నేనే కనుక వేణు స్వామి ని డబ్బులు డిమాండ్ చేసినట్టు రుజువు అయితే నన్ను కొట్టి చంపేయండి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ సమయం లో గవర్నర్ ND తివారీ స్టోరీని బయటపెట్టింది నేనే. అలాంటి హై ప్రొఫైల్ కేసులోనే డబ్బు ఆశకి లొంగని నేను నిన్ను డబ్బులు అడిగానా’ అంటూ మూర్తి చెప్పుకొచ్చాడు. మరి వేణు స్వామి దీనికి ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నాడో చూడాలి.