Chandu Champion Movie Review : యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకొని ఈమధ్య మన ఇండియన్ ఫిలిం మేకర్స్ తీస్తున్న సినిమాలకు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. కమర్షియల్ సినిమాలు, ప్రేమ కథ చిత్రాలు, యాక్షన్ చిత్రాలను చూసి విసుగెత్తిపోయిన జనాలు కూడా ఇలాంటి సినిమాలను చూసేందుకు అమితాసక్తిని చూపిస్తున్నారు. అలా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్, కార్తీక్ ఆర్యన్ ని హీరో గా పెట్టి ‘చందు- ది ఛాంపియన్’ అనే సినిమా చేసాడు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 14 వ తారీఖున విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి యావరేజి గా నిల్చింది. కానీ ఈ చిత్రానికి ఓటీటీ లో మాత్రం ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. విడుదలైన రోజు నుండి నేటి వరకు ఇండియా లో నెంబర్ 1 స్థానం లో ట్రేండింగ్ అవుతూ, రికార్డు స్థాయి వ్యూస్ తో దూసుకుపోతుంది. ఓటీటీ ఆడియన్స్ కి అంతలా నచ్చేంత ఈ చిత్రం లో ఏముంది?, అసలు కథ ఏమిటి అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూద్దాం.
1972 వ సంవత్సరం లో ప్యారాలింపిక్ గేమ్స్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేవారు. ఈ పోటీలలో కుస్తీ విభాగం లో ఇండియా కి ఎలా అయినా గోల్డ్ మెడల్ తీసుకొని రావాలని మురళీకాంత్ పెట్కార్ కోరిక. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల అతని కాళ్ళు పోతాయి. అయినప్పటికీ కూడా పట్టువీడకుండా ఎంతో కష్టపడి 1972 వ సంవత్సరం లో జరిగిన ప్యారాలింపిక్ గేమ్స్ లో ఎలా పోరాడి ఇండియా కి గోల్డ్ మెడల్ తెచ్చాడు?, అందుకోసం అతను పడిన కస్టాలు ఏమిటి అనేది మిగిలిన స్టోరీ. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే ఈ సినిమా చూస్తే మీకు ఎంతో ఉత్తేజం కలుగుతుంది.
కార్తీక్ ఆర్యన్ ఈ పాత్రలో జీవించేసాడు. కబీర్ ఖాన్ మార్క్ ఎమోషన్స్, సెంటిమెంట్ అన్నీ ఈ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లాయి. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాని ఆలస్యం చెయ్యకుండా వెంటనే చూసేయండి. వారం మొత్తం శ్రమించి వీకెండ్ లో కాస్త ఎంటర్టైన్మెంట్ కావాలని కోరుకోవడం సహజం. ఈ వారం విడుదలైన సినిమాలన్నీ పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ అనే విషయం మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ వీకెండ్ ‘చందు ది- ఛాంపియన్’ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చెయ్యండి.