MR Bachchan ‘షాక్’, ‘మిరపకాయ్’ వంటి చిత్రాల తర్వాత రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం పై విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు ఉండేవో మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రం నుండి విడుదలైన పాటలు , టీజర్, ట్రైలర్ తో పాటు పోస్టర్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా హీరోయిన్ భాగ్య శ్రీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయింది. ఆమె అందం కుర్రాళ్ళ బుర్రలు వేడెక్కిపోయేలా చేసింది. వీటికి అదనంగా డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదలకు ముందు చేసిన ప్రొమోషన్స్, ఆయన చేసిన కాంట్రవెర్షియల్ కామెంట్స్ ఈ చిత్రం పై మరింత రెట్టింపు అంచనాలను పెంచాయి. అలా భారీ అంచనాల నడుమ నిన్న విడుదలైన ఈ చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చింది.
హరీష్ శంకర్ ఈ సినిమా ఆడియన్స్ కి నచ్చుతుంది అనే అతి విశ్వాసంతో విడుదలకు ముందు రోజు, అనగా ఆగష్టు 14 వ తేదీన సాయంత్రం నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ వేశారు. ఆ షోస్ నుండి వచ్చిన టాక్ ప్రభావం వల్ల మొదటి రోజు వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఫలితంగా కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సిన ఈ సినిమా 4 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక అన్నీ రవితేజ సినిమాలు లాగానే, ఈ సినిమాకి కూడా ఓవర్సీస్ లో ఓపెనింగ్ రాలేదు. కర్ణాటక, చెన్నై వంటి ప్రాంతాలలో కూడా అంతంత మాత్రమే.
ఓవరాల్ గా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకి కేవలం ఆరు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక రెండవ రోజు ఈ చిత్రానికి నూన్ షోస్ అత్యంత దారుణమైన ఆక్యుపెన్సీ తో మొదలయ్యాయి. పరిస్థితి చూస్తూ ఉంటే ఈ సినిమా ఫుల్ రన్ లో 30 శాతం కూడా రికవరీ అయ్యేలా కనిపించడం లేదు. మరోపక్క హీరో రవితేజ కి సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ ఉత్తరాలు రాస్తున్నారు. ఒకప్పటి రవితేజ మాకు ఇప్పుడు దొరకడం లేదు, పరమ చెత్త సినిమాలు చేస్తున్నాడు, ఇక మీదట మేము ఆయన సినిమాలను చూడలేము, ఇలాంటి దరిద్రంగా సినిమాలు చేసేకంటే ఆయన సినిమాల నుండి పూర్తిగా తప్పుకోవడం మంచిది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.