Double iSmart : డిజాస్టర్ టాక్ తో ఈ రేంజ్ వసూళ్లా..? ఆశ్చర్యపరుస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ మొదటిరోజు వసూళ్లు!

- Advertisement -
Double iSmart : మీడియం రేంజ్ హీరో అయినప్పటికీ కూడా స్టార్ హీరోల లీగ్ లోకి అడుగుపెట్టేందుకు అన్నీ విధాలుగా అర్హతలు ఉన్న యంగ్ హీరోలలో ఒకడు రామ్ పోతినేని. కెరీర్ లో ఆయన ఇది వరకు ఎన్నో మాస్ సినిమాలు చేసాడు కాదు, ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం మాత్రం ఆయన కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి ముందు ఆయనకీ వరుస ఫ్లాప్ వచ్చాయి, మార్కెట్ బాగా దెబ్బ తినింది. అలాంటి సమయంలో విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం రామ్ లోని కొత్త యాంగిల్ ని చూపించి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. అలాంటి సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ‘డబుల్ ఇస్మార్ట్’ అనే చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది.
Double iSmart
Double iSmart

మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని తెచ్చుకున్న ఈ సినిమా పై సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో ట్రోల్ల్స్ నడుస్తున్నాయి మనమంత చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా కమెడియన్ అలీ ట్రాక్ రాసినందుకు పూరీ జగన్నాథ్ ని ప్రతీ ఒక్కరు తిడుతున్నారు. అది కాసేపు పక్కన పెడితే, ఈ చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కూడా రామ్ కి ఉన్న మాస్ క్రేజ్ కారణంగా ఓపెనింగ్స్ అదిరిపోయాయి. మొదటి రోజు ఈ సినిమాతో పాటుగా పోటీగా నాలుగు సినిమాలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి 5 కోట్ల రూపాయలకు పైగా మొదటి రోజు షేర్ వసూళ్లు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

Double iSmart Movie Review Ram Pothineni Sanjay Dutt film is a slap to your senses - India Today

కానీ ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 40 కోట్ల రూపాయలకు పైగానే జరిగింది. రెండవ రోజు మార్నింగ్ షోస్ కి వచ్చిన వసూళ్లు చూస్తుంటే ఈ సినిమాకి ఫుల్ రన్ లో కనీసం 15 కోట్ల రూపాయిలైనా వస్తుందా అని ట్రేడ్ పండితులు సందేహ పడుతున్నారు. ఈ సినిమా దెబ్బతో పూరీ జగన్నాథ్ ఇక సినిమాలు మానేయడం పక్కా అని, ఆయన చిత్రాలని డిస్ట్రిబ్యూటర్స్ ఇక కొనబోరని, ‘గాడ్ ఫాదర్’ చిత్రం తో ఎలాగో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి, ఇక నటుడిగానే కొనసాగాలంటూ ఆయనకీ సలహాలు ఇస్తున్నారు అభిమానులు.

- Advertisement -

Double iSmart Movie Review; Here's What Netizens Have To Say About Ram Pothineni and Puri Jagannadh's Movie | Times Now

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here