Sreeleela : ముక్కుపుడకతో శ్రీలీల అందం అదుర్స్

- Advertisement -

Sreeleela టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తన లేటెస్ట్ ఫొటోషూట్ తో అభిమానులను సర్ ప్రైజ్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ లెహంగాలో పోస్టు చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో హైలైట్ గా ఈ భామ ముక్కుపుడక నిలిచింది. ముక్కు పుడకతో శ్రీలీల చాలా అందంగా కనిపిస్తోంది.

Sreeleela
Sreeleela

తాజాగా శ్రీలీల పోస్టు చేసిన ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లెహంగాలో అదిరిపోయావ్ బ్యూటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ముక్కు పుడకతో భలే అందంగా ఉన్నావంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు శ్రీలీల ఫొటోలు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ ఫొటోలకు నెటిజన్లు లైకుల మీద లైకులు కొట్టేస్తున్నారు.

Image

- Advertisement -

ఇక శ్రీలీల సినిమాల సంగతికి వస్తే ప్రస్తుతం ఈ భామ పవన్ కల్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, నితిన్ తో రాబిన్ హుడ్, నవీన్ పొలిశెట్టితో అనగనగా ఒక రోజు, రవితేజతో మరో సినిమాలో నటిస్తోంది. కన్నడలో జూనియర్, దుబారి అనే చిత్రాలకు ఓకే చెప్పింది. ప్రస్తుతం అరడజను సినిమాలు ఈ భామ చేతిలో ఉన్నాయి.

Image

కెరీర్  మొదట్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్న ఈ భామ ఇప్పుడు మాత్రం ఆచితూచి అడుగేస్తోంది. బెస్ట్ స్క్రిప్టులను సెలెక్ట్ చేసుకుంటూ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ పాపులారిటీ సంపాదించుకుంటోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here