Saripodhaa Sanivaaram : ప్రకంపనలు పుట్టించిన ‘సరిపోదా శనివారం’ ట్రైలర్..ఈసారి లెక్క 200 కోట్ల నుండి మొదలు!

- Advertisement -

Saripodhaa Sanivaaram: విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజీ ఏర్పాటు చేసుకున్న న్యాచురల్ స్టార్ నాని, ఇప్పుడు సరిపోదా శనివారం చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు. సినిమా షూటింగ్ ప్రారంభం నుండి ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని కలిగించిన ఈ సినిమా ఈ నెల 29 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబందించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు సాయంత్రం హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో వందలాది మంది అభిమానుల కోలాహలం మధ్య విడుదల చేసారు. రెస్పాన్స్ అదిరిపోయింది.

Saripodhaa Sanivaaram, regular shoot rolls | cinejosh.com

కాసేపటి క్రితమే ఈ ట్రైలర్ ని యూట్యూబ్ లో అప్లోడ్ చెయ్యగా ఒక స్టార్ హీరో సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో, అలాంటి రెస్పాన్స్ ఈ ట్రైలర్ కి వచ్చింది. ట్రైలర్ లో చిన్నతనం నుండి విపరీతమైన కోప స్వభావం ఉన్న హీరోని అతని తల్లి కంట్రోల్ చేసేందుకు శనివారం మాత్రమే నీ కోపాన్ని చూపించాలంటూ ప్రమాణం తీసుకుంటుంది. హీరో తల్లికి ఇచ్చిన మాట ప్రకారం తూచా తప్పకుండా పాటిస్తాడు. అలా పెరిగిన హీరో జీవితంలోకి ఒక క్రాక్, సైకో మెంటాలిటీ తో ఉన్న అవినీతి పోలీస్ అధికారి అడుగుపెడతాడు. అలాంటి మెంటాలిటీ ఉన్న పోలీస్ అధికారితో హీరో కి ఎందుకు వైరం ఏర్పడింది ?, ఆ వైరం కారణంగా ఎలాంటి పరిస్థితులు ఎదురు అవుతాయి అనేదే సినిమా స్టోరీ.

- Advertisement -

Saripodhaa Sanivaaram | మంగ‌ళ‌వారం వ‌స్తున్న నాని 'సరిపోదా శనివారం'  ట్రైల‌ర్-Namasthe Telangana

ఆద్యంతం ఆసక్తి కలిగించే విధంగా ఉన్న ఈ ట్రైలర్ ని చూస్తుంటే నాని మరోసారి గట్టిగా బాక్స్ ఆఫీస్ వద్ద తన ప్రతాపం చూపించబోతున్నాడు అనేది తెలుస్తుంది. ‘దసరా’ చిత్రం తో వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన నాని, ఈ సినిమాతో రెండు వందల కోట్ల రూపాయిలు కొల్లగొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. అదే జరిగితే నాని స్టార్ హీరోల లీగ్ లోకి అడుగుపెట్టినట్టే. ఇప్పటికే నైజాం, ఓవర్సీస్ ప్రాంతాలలో స్టార్ హీరోలతో సమానమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న నాని, ఈ చిత్రంతో వరల్డ్ వైడ్ గా స్టార్ హీరో అయిపోతాడని అంటున్నారు అభిమానులు. సోషల్ మీడియా ని ఊపేస్తున్న ఆ ట్రైలర్ ని మీరు కూడా చూసి ఎంజాయ్ చెయ్యండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here