Venu Swamy : రేటింగ్స్ కోసం దిగజారే మీరు నా భర్తని అంటారా అంటూ వేణు స్వామి భార్య సంచలన కామెంట్స్!

- Advertisement -

Venu Swamy : సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు, హీరోయిన్ల జాతకాలను వాళ్ళ అనుమతి లేకుండానే చెప్పి వివాదాలలో ఎల్లప్పుడూ మునిగి తేలే వేణు స్వామి, ఎన్నికల ఫలితాల జాతకం తప్పు చెప్పాడు కాబట్టి మళ్ళీ ఆయన ఏ సెలబ్రిటీ జోలికి వెళ్లడని అందరూ అనుకున్నారు. ఆయన కూడా ఎన్నికల ఫలితాల తర్వాత అదే చెప్పాడు. కానీ నాగ చైతన్య – శోభిత నిశ్చితార్థం జరిగిన వెంటనే మళ్ళీ తెల్లబోర్డు వేసుకొని జాతకం చెప్తూ ఒక వీడియో వదిలాడు. ఆ వీడియో లో నాగ చైతన్య – శోభిత వైవాహిక జీవితం బాగుండదని, 2027 వ సంవత్సరం లో వాళ్లిద్దరూ ఒక స్త్రీ కారణంగా విడిపోతారని నోటికి వచ్చిన కామెంట్లు చేసి నెటిజెన్స్ చేత చివాట్లు పెట్టించుకున్నాడు.

Astrologer Venu Swamy makes a prediction about Naga Chaitanya, Sobhita Dhulipala

కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న జంట గురించి ఇలాంటి కామెంట్స్ చెయ్యడానికి సిగ్గు అనిపించడంలేదా, ఏళ్ళు వచ్చాయి నీకు, కానీ బుద్ధి మాత్రం రాలేదు అంటూ వేణు స్వామి ని తిట్టని వారంటూ లేరు. ట్రోలింగ్స్ అతని వరకు చేరేసరికి వెంటనే మరో వీడియో చేస్తూ నేను ఇక మీదట సెలెబ్రిటీల జాతకాలను చెప్పను అనే మాటకి కట్టుబడి ఉన్నాను, కానీ నాగ చైతన్య వైవాహిక జీవితం గురించి గతంలో చెప్పాను, దానికి కొనసాగింపుగా మాత్రమే ఇప్పుడు నేను ఈ వీడియో చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇదంతా పక్కన పెడితే నేడు ఆయన సతీమణి వీణ వేణు స్వామి కి సపోర్టు చేస్తూ మీడియా పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.

- Advertisement -

Naga Chaitanya and Sobhita Dhulipala break up! Astrologer's viral prediction faces backlash, venu swamy, astrologer predicts naga chaitanya future, naga chaitanya, sobhita dhulipala, engagement

ఆమె మాట్లాడుతూ ‘గంటలతరబడి జనాలకి ఉపయోగం లేని విషయాల గురించి డిబేట్స్ చేస్తూ జర్నలిజం విలువలను తుంగలోకి తొక్కిన మీడియా చానెల్స్ నేడు నా భర్త గురించి కథనాలు ప్రచారం చెయ్యడం హాస్యాస్పదంగా ఉంది. వీళ్ళకి రాజ్ తరుణ్ – లావణ్య ప్రేమ వ్యవహారం పై డిబేట్స్ చెయ్యడానికి సమయం ఉంది కానీ, బాంగ్లాదేశ్ లో హిందువులపైన జరుగుతున్న దాడి పై డిబేట్స్ చెయ్యడానికి మాత్రం ఉండదు. ఈరోజు మంచు విష్ణు గారు కాల్ చేసి నాతో ఎంతో మర్యాదగా మాట్లాడాడు. మా ఆయన అలా మాట్లాడడం తప్పు అని చెప్పుకొచ్చాడు. కానీ మీడియా లో జర్నలిస్ట్స్ సినీ సెలబ్రిటీస్ పై చేస్తున్న తప్పుడు ప్రచారాలను కూడా ఆయన ఖండించాలి కదా, ఎందుకు చెయ్యడం లేదు’ అంటూ వీణ ప్రశ్నించింది. వీణ ఒక సంగీత కాళాకారిణి గా ఎంతో మంచి పాపులారిటీ ఉన్న వ్యక్తి. ఆమె ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో లైవ్ మ్యూజిక్ పెర్ఫార్మన్స్ కూడా ఇచ్చింది. నోట్లో అసలు నాలుకే ఉండదు అన్నట్టుగా అనిపించే వీణలో ఇంత మాట్లాడుతుందా అని ఈరోజే అందరికి తెలిసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here