Abhishek Bachchan : ఆమెని ఈ జీవితం లో క్షమించలేను అంటూ అభిషేక్ బచ్చన్ ఎమోషనల్ కామెంట్స్!

- Advertisement -
Abhishek Bachchan : ప్రస్తుతం సోషల్ మీడియా లో నిత్యం ట్రెండింగ్ లో ఉంటున్న పేర్లలో ఒకటి అభిషేక్ బచ్చన్. ఆయన తన సతీమణి ఐశ్వర్య రాయ్ తో విడాకులు తీసుకోబోతున్నారని, గత కొంతకాలంగా ఇద్దరు ఎడమొహం, పెడమొహం లాగ ఉంటున్నారని, మొన్న జరిగిన అనంత్ అంబానీ పెళ్లి లో కూడా ఇద్దరు దూరంగా ఉన్నారని, ఇలా ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియా లో ప్రచారం అవుతూనే ఉన్నాయి. ఇందులో ఏది నిజం, ఏది అబద్దం అనే విషయాన్నీ కాసేపు పక్కన పెడితే, అభిషేక్ బచ్చన్ కి ఒక స్టార్ హీరోయిన్ మీద పీకలదాకా కోపం ఉందట. రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే అభిషేక్ బచ్చన్ బాలీవుడ్ లోకి ‘రీఫ్యూజీ’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసాడు.

Abhishek Bachchan FINALLY Reacts To Divorce Rumours With Aishwarya Rai Bachchan: You All Have... - Newsx

అప్పట్లో అభిషేక్ బచ్చన్ బాలీవుడ్ ఎంట్రీ ఒక సెన్సేషన్ అనే చెప్పొచ్చు. ఓపెనింగ్స్ లో ఆల్ టైం రికార్డుని సృష్టించిన ఈ సినిమా, ఫుల్ రన్ లో కూడా దాదాపుగా ఆల్ టైం రికార్డు గ్రాస్ కి దగ్గరగా వెళ్ళింది. ఈ సినిమా ద్వారానే ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే షూటింగ్ సమయం లో ఆమె అభిషేక్ బచ్చన్ తో మాట్లాడిన ఒక మాట, అభిషేక్ బచ్చన్ కి నరకం అనుభవించేలా చేసిందట.

When Kareena Kapoor said Abhishek Bachchan 'is going to be better' than Amitabh Bachchan | Bollywood - Hindustan Times

- Advertisement -

నువ్వు నాకు తమ్ముడి లాంటి వాడివి, నీతో నేను రొమాంటిక్ సన్నివేశాలు ఎలా చెయ్యాలి చెప్పు అంటూ ఆమె సరదాగా అభిషేక్ బచ్చన్ తో అనిందట. ఆ మాట ని అభిషేక్ బచ్చన్ బాగా వ్యక్తిగతంగా తీసుకున్నాడు. కరీనా కపూర్ తో రొమాంటిక్ సన్నివేశం చేసే సమయంలో ఆమె మాట్లాడిన ఆ మాటలే గుర్తుకు వచ్చేవట. దీంతో ఆ సన్నివేశాలను ఆయన సరిగా చెయ్యలేకపోయాడట. అప్పట్లో రివ్యూస్ లో కూడా సినిమాకి మైనస్ పాయింట్స్ లో ఈ రొమాంటిక్ సన్నివేశాల గురించి చెప్పేవారట. కరీనా కపూర్ నాకు అలా చెప్పడం చాలా తప్పు అనిపించింది. ఆ విషయం లో నేను ఆమెని ఈ జన్మకి క్షమించను అంటూ ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే కరీనా కపూర్ ఆ చిత్రం తర్వాత వరుస హిట్స్ తో స్టార్ హీరోయిన్ అవ్వగా, అభిషేక్ బచ్చన్ మాత్రం సరైన స్క్రిప్ట్స్ ఎంచుకోక రేస్ నుండి తప్పుకున్నాడు.

Kemmannu.com | Kareena Kapoor, Abhishek Bachchan complete 20 years in Bollywood; recall 'Refugee' days

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here