Priya Prakash Varrier : చీరకట్టులో వింక్ బ్యూటీ ప్రియా వారియర్ సొగసులు

- Advertisement -

ప్రియా ప్రకాశ్ వారియర్.. ఒక్క చూపుతో యావత్ దేశంలో కుర్రాళ్లను తనవైపునకు తిప్పుకుంది ఈ భామ. ఓర చూపుతో కన్నుగీటి తన మాయలో పడేసింది. రాత్రికి రాత్రే సూపర్ పాపులర్ అయింది. మొదటి సినిమాతోనే తన సత్తా చూపింది. మలయాళంలో రిలీజ్ అయిన ఒరు ఆధార్ లవ్ తో అరంగేట్రం చేసి మూవీ లవర్స్ మది దోచేసింది.

Priya Prakash Varrier
Priya Prakash Varrier

సినిమాలో ఈ బ్యూటీ నటనను చూసి ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. టాలీవుడ్ డైరెక్టర్లు ఈ భామకు ఛాన్సులు వెల్లువెత్తాయి. కానీ ఆ సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడంతో ఈ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీలో క్లిక్ అవ్వలేదు. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసింది.

Image

- Advertisement -

అయితే సోషల్ మీడియాలో మాత్రం ప్రియ చాలా ఫేమస్. తన ఫొటోషూట్ తో అభిమానులకు అందాల విందు వడ్డిస్తోంది. తాజాగా ప్రియ చీరకట్టులో సందడి చేసింది. శారీలో ఈ భామ క్యూట్ పోజులతో కుర్రాళ్ల మది దోచేసింది. క్యూట్ స్మైల్ తో కట్టిపడేసింది. ముసిముసి నవ్వులు నవ్వుతూ మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ప్రియా వారియర్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here