Arjun Ambati బిగ్ బాస్ రియాలిటీ షోకి మన తెలుగు లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ షో ని నమ్ముకొని ఎంతోమంది జీవనం సాగిస్తూ ఉంటారు. యూట్యూబ్ చానెల్స్ కి ఈ సీజన్ నడిచినంత కాలం పండగే అని చెప్పొచ్చు. బిగ్ బాస్ యాజమాన్యం కూడా ప్రతీ ఏడాది సరికొత్త ఆలోచనలతో మన ముందుకు వస్తుంటారు. గత సీజన్ లో ఉపయోగించిన ‘ఉల్టా పల్టా’ కాన్సెప్ట్ ఎంత సక్సెస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సీజన్ లో ‘ఇన్ఫినిటీ’ అనగా ‘అనంతం’ అనే కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చారు. అంటే ఎంటర్టైన్మెంట్ విషయం లో కానీ, టాస్కులు ఆడే విషయం లో కానీ మొదటి రోజు నుండి హౌస్ మేట్స్ కి అనంతం అనే రేంజ్ లో ఉండబోతుంది అనేది దీని అర్థం.
ఈ సీజన్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ తో అగ్రీమెంట్స్ కూడా దాదాపుగా ఖరారు అయ్యాయి. అలాగే బిగ్ బాస్ ఎపిసోడ్స్ మీద ఆడియన్స్ కి ఎంత ఆసక్తి ఉంటుందో, ‘బిగ్ బాస్ బజ్‘ ఎపిసోడ్స్ మీద కూడా అంతే ఆసక్తి ఉంటుంది. ప్రతీ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ తో గత సీజన్ కి సంబంధించిన టాప్ మోస్ట్ కంటెస్టెంట్స్ లో ఒకరితో ఇంటర్వ్యూ చేయిస్తారు. గత సీజన్ కి గీతూ రాయల్ వచ్చింది. ఈ సీజన్ కి అందరూ శివాజీ, లేదా శోభా శెట్టి వస్తారని ఊహించుకున్నారు కానీ, చివరికి అంబటి అర్జున్ డేట్స్ ని ఖరారు చేసుకున్నారు. గత సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన అంబటి అర్జున్ ఎంత అద్భుతంగా ఆడాడో మన కళ్లారా చూసాము.
అర్జున్ మొదటి ఎపిసోడ్ నుండే వచ్చి ఉంటే కచ్చితంగా ఆయనే టైటిల్ ని గెలిచేవాడు అని ప్రతీ ఒక్కరు అనుకున్నారు. ఆ స్థాయిలో అర్జున్ టాస్కులు ఆడాడు. బయట చాలా సరదాగా, ఫన్నీ గా ఉండే అంబటి అర్జున్, ముక్కుసూటి తనం తో మాట్లాడడంలో కూడా దిట్ట. అందుకే బిగ్ బాస్ బజ్ ఎపిసోడ్స్ కి ఆయన పర్ఫెక్ట్ గా ఉంటాడని స్టార్ మా యాజమాన్యం అతన్ని లాక్ చేసింది. అయితే అర్జున్ ఒక్కో ఎపిసోడ్ కి లక్ష రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి బిగ్ బాస్ టీం కూడా ఓకే చెప్పినట్టు సమాచారం.