Murari : సూపర్ స్టార్ మహేష్ బాబు రీ రిలీజ్ ట్రెండ్ కి కింగ్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. అంతకు ముందు స్టార్ హీరోల పుట్టినరోజు సమయాలలో అభిమానులు అక్కడక్కడా ప్రత్యేకమైన షోస్ వేసుకునే వారు కానీ, పుట్టినరోజు కి పాత సినిమాలను గ్రాండ్ గా రీ రిలీజ్ చెయ్యాలి అనే ఆలోచన చేసింది మాత్రం ‘పోకిరి’ సినిమాతో మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ ఆలోచనను మరో లెవెల్ కి తీసుకెళ్లారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ‘మురారి’ చిత్రాన్ని 4K క్వాలిటీ కి మార్చి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేసారు.
ఈ రీ రిలీజ్ మూవీ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ స్థాయి రెస్పాన్స్ ఒక రీ రిలీజ్ కి వస్తుందని అభిమానులు, మూవీ టీం కూడా అంచనా వెయ్యలేకపోయింది. మొదటి రోజు ఈ చిత్రానికి 5 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కేవలం ఒక్క నైజాం ప్రాంతం నుండే ఈ సినిమాకి మూడు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయంటే చిన్న విషయం కాదు. ఇక రెండవ రోజు కూడా ఈ చిత్రానికి నైజాం ప్రాంతం కోటి 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా రెండు రోజులకు కలిపి 7 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమా, మూడు రోజులకు కలిపి 9 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇది టాలీవుడ్ హిస్టరీ లోనే ఆల్ టైం రికార్డు గా చెప్పుకోవచ్చు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మురారి చిత్రం అప్పట్లో మొట్టమొదటిసారిగా విడుదలైనప్పుడు అప్పటి మార్కెట్ ని బట్టి కేవలం 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. కానీ ఇప్పుడు మురారి చిత్రం రీ రిలీజ్ క్లోసింగ్ లో దాదాపుగా 5 కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ రికార్డు ని సెప్టెంబర్ 2 వ తేదీన విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ రీ రిలీజ్ బద్దలు కొడుతుందా లేదా అనేది చూడాలి.