Renu Desai : సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సెలబ్రిటీస్ లో ఒకరు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్. నిత్యం అభిమానులతో టచ్ లో ఉంటూ తనకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈమెని అత్యధికంగా ఫాలో అవుతుండడంతో ఈమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ కి అద్భుతమైన రీచ్ వచ్చింది. అంతే కాకుండా ఈమె అప్పుడప్పుడు అకిరా నందన్, ఆద్య ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటుంది. దీని కోసమే పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెని ఇప్పటికీ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అనుసరిస్తూ ఉంటారు. అయితే అప్పుడప్పుడు ఆమె కొంతమంది అభిమానులు పెట్టే పోస్టులకు చాలా చిరాకు పడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు సోషల్ సర్వీస్ కూడా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా చేస్తూ ఉంటుంది.
రీసెంట్ గా ఆమె తన పెట్స్ కోసం రైస్ సహాయం చెయ్యాలి అంటూ ఒక పోస్టు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అందుకోసం ముందుగా ఒక 50 కేజీలు తన వంతుగా సహాయం చేస్తున్నాను అని, మిగిలినది మీరు చెయ్యాలి అంటూ చెప్పుకొచ్చింది. దీనికి టాలీవుడ్ క్రేజీ హీరో అడవి శేష్ స్పందించాడు. తనకి తోచిన సహాయం చేసాడు. దీనిని రేణు దేశాయ్ ప్రశంసిస్తూ ‘గాయపడిన ఈ మూగ జీవి వైద్యం కోసం అడవి శేష్ 15 వేల రూపాయిల సహాయం చేసాడు. నువ్వు సినిమాల్లోనే కాదు, నిజ జీవితం లో కూడా హీరోవి’ అంటూ ఒక స్టోరీ పెట్టింది.
ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అడవి శేష్ తో రేణు దేశాయ్ ముందు నుండే మంచి సాన్నిహిత్య సంబంధం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అకిరా నందన్ ఎక్కువగా అడవి శేష్ తోనే కలిసి తిరుగుతూ ఉంటాడు. వీళ్లిద్దరి స్నేహం చూసి అభిమానులు కూడా ఆశ్చర్యపోతుంటారు. అడవి శేష్ కూడా అకిరా నందన్ గురించి పలు ఇంటర్వూస్ లో ఎంతో గొప్పగా మాట్లాడిన సందర్భాలను మనం చూసాము. ఆ అభిమానం తోనే ఆయన రేణు దేశాయ్ అడిగిన వెంటనే స్పందించి సహాయం చేసాడు. ఇలాంటి సంఘటనలు వీరి మధ్య అంతర్గతంగా ఎన్నో జరిగి ఉంటాయని మీ అందరికీ అర్థం అయ్యే ఉంటుంది.