Naga Chaitanya : నిశ్చితార్థం జరిగిన రెండవ రోజే మరోపెళ్లిలో నాగచైతన్య.. వైరల్ అవుతున్న ఫోటోలు!

- Advertisement -

Naga Chaitanya : సమంత నాగ చైతన్య కి విడాకులు జరిగిన సంఘటన ఎంత సెన్సేషనల్ టాపిక్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సంఘటన నుండి అభిమానులు ఇంకా పూర్తిగా బయటకి రాకముందే, నాగ చైతన్య ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నాడు. రీసెంట్ గానే వీళ్లిద్దరు నాగార్జున గెస్ట్ హౌస్ లో ఉంగరాలు మార్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. త్వరలోనే వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించిన అప్డేట్ అధికారికంగా బయటకి రానుంది. గత కొంతకాలం శోభిత నాగ చైతన్య తో డేటింగ్ చేస్తుంది అంటూ సోషల్ మీడియా లో న్యూస్ చక్కర్లు కొడుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

Naga Chaitanya
Naga Chaitanya

వీళ్ళిద్దరూ కలిసి వరల్డ్ టూర్స్ కి వెళ్లిన ఫోటోలు కూడా సోషల్ మీడియా లో వచ్చాయి. కానీ వీళ్ళు కేవలం స్నేహితులు మాత్రమేనని, అంతకు మించి వీళ్ళ మధ్య ఎలాంటి సంబంధం లేదంటూ మరో వాదన కూడా వినిపించింది. వీటి అన్నిటికి తెరదించుతూ మొత్తానికి వీళ్లిద్దరు ఒక్కటి అవ్వబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే నాగ చైతన్య నిశ్చితార్థం జరిగిన రెండవ రోజే ఒక పెళ్ళిలో తళుక్కుమని మెరిశాడు. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. రాజమండ్రిలో తన అసిస్టెంట్ వెంకటేష్ పెళ్ళికి నాగ చైతన్య హాజరై వధూవరులను ఆశీర్వదించాడు. ఇంత హడావడిలో కూడా నాగ చైతన్య తన అసిస్టెంట్ పెళ్ళికి హాజరు అవ్వడంపై సోషల్ మీడియా లో ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తుంది.

Naga Chaitanya Attended Assistant Marriage In Rajahmundry

- Advertisement -

ఇకపోతే నాగ చైతన్య సినిమా విషయానికి వస్తే గత కొంత కాలంగా ఆయన వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ అందుకుంటూ ఉన్నాడు. అలాంటి సమయం లో ఆయనకీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిన దూత వెబ్ సిరీస్ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. ఇప్పుడు ఆయన కార్తికేయ సిరీస్ ఫేమ్ చందు మొండేటితో కలిసి ‘తండేల్’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సుమారుగా 70 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా, సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం మీద అక్కినేని అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు.

Naga Chaitanya: 'తండేల్' నుంచి నాగచైతన్య ఫోటో లీక్.. ఊరమాస్ గెటప్‏లో చైతూ లుక్ అదుర్స్.. - Telugu News | Naga Chaitanya's Mass look photo leaked from Thandel movie telugu cinema news | TV9 Telugu

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here