Actor Surya : షూటింగ్ లో హీరో సూర్య కి తీవ్ర గాయాలు..ఆందోళనలో అభిమానులు!

- Advertisement -

Actor Surya : తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి టాలీవుడ్ ఆడియన్స్ అమితంగా ఇష్టపడే హీరోలలో ఒకడు సూర్య. ఒకానొక దశలో ఈయన సినిమాలు మన తెలుగు హీరోల సినిమాలను కూడా డామినేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సూర్య ఈమధ్య కాలం లో బాగా డౌన్ అయ్యాడు. ఆయన చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఇప్పుడు ఆయన నుండి అభిమానులు ఒక భారీ కం బ్యాక్ ని ఆశిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే సూర్య కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం లో ’44’ అనే చిత్రం చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇటీవలే సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ని విడుదల చేసారు. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Actor Surya
Actor Surya

ఇది ఇలా ఉండగా ఈ సినిమా షూటింగ్ చేస్తున్న సమయం లో సూర్య తలకి పెద్ద గాయమైందని, అతన్ని వెంటనే హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారని సోషల్ మీడియా లో ఒక వార్త ఆయన అభిమానులను హడలిపోయేలా చేసింది. అభిమానుల కంగారుని గమనించిన ఆ చిత్ర నిర్మాత రాజశేఖరన్ పాండియన్ స్పందిస్తూ ‘ సూర్య గారికి షూటింగ్ సమయంలో గాయాలైన విషయం వాస్తవమే. కానీ అవేమి తీవ్రమైన గాయాలు కావు, కేవలం స్వల్ప గాయాలు మాత్రమే. ఆయన్ని వెంటనే హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించాము. ఇప్పుడు ఆయన కోలుకుంటున్నారు, త్వరలోనే షూటింగ్ లో పాల్గొంటారు’ అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాకి సంబంధించిన రెండవ షెడ్యూల్ ఇటీవలే ఊటీ లో మొదలైంది.

After delaying Puranaanooru, Suriya teams up with Karthik Subbaraj for his 44th film | Tamil News - The Indian Express

- Advertisement -

ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తునం సమయం లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇకపోతే సూర్య ఈ సినిమాకి ముందు శివ అనే తమిళ టాప్ డైరెక్టర్ తో ‘కంగువా’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమాకి సంబంధించిన మొదటి టీజర్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం తో సూర్య భారీ కం బ్యాక్ ఇచ్చి తన సత్తా ని బాక్స్ ఆఫీస్ కి మరోసారి రుచి చూపిస్తాడని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు ఆయన అభిమానులు.

Is the Suriya starrer 'Kanguva' pushed to a 2025 release? Here's what we know | Tamil Movie News - Times of India

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here