Saripodhaa Sanivaaram Movie Review టాలీవుడ్ ఆడియన్స్ కి కొత్త తరహా థియేట్రికల్ అనుభూతి కలిగించాలి అని తపనపడి, ఆ తరహా సినిమాలు తియ్యడానికి కృషి చేసే హీరోలలో ఒకడు న్యాచురల్ స్టార్ నాని. ఇతని ఫిల్మోగ్రఫీ మొత్తాన్ని ఒకసారి పరిశీలిస్తే, ఒక సినిమాకి మరో సినిమాకి ఏ మాత్రం పొంతన ఉండదు. అందువల్ల ఆయనకీ మధ్యలో కొన్ని ఫ్లాప్స్ తగిలాయి, అయినప్పటికీ కూడా వెనకడుగు వెయ్యలేదు. ఆయన నమ్ముకున్న దారిలోనే పయనించాడు. అందుకే మన టాలీవుడ్ కి ‘దసరా’ వంటి అద్భుతమైన సినిమా అందింది. ఇప్పుడు ఆయన ‘సరిపోదా శనివారం’ అనే విన్నూతన కథతో ఈ నెల 29 వ తేదీన మన ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు.
గతం లో వివేక్ ఆత్రేయ నాని తో ‘అంటే సుందరానికి’ అనే చిత్రం చేసాడు. అప్పట్లో థియేటర్స్ లో పెద్దగా ఈ చిత్రం ఆడకపోయినప్పటికీ ఓటీటీ లో మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఇలాంటి విన్నూతన కథలతో తన దగ్గరకి వస్తే కాదు అనని నాని, ఇప్పుడు అతనితో ‘సరిపోదా శనివారం‘ చేసాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి అయ్యింది. మొదటి కాపీ ని ఇటీవలే ప్రసాద్ ల్యాబ్స్ లో కొంతమంది మీడియా ప్రముఖులకు స్పెషల్ షో వేసి చూపించారు. వారి నుండి ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హీరో, విలన్ క్యారెక్టర్స్, వారి మధ్య వచ్చే పోరాట సన్నివేశాలను డైరెక్టర్ అద్భుతంగా రాసుకున్నాడని ఈ సినిమాని చూసిన వారు చెప్పారట.
ఇంటర్వెల్ ఎపిసోడ్, సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు, ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ సన్నివేశాలు ఈ చిత్తానికి హైలైట్ గా ఉండబోతున్నాయట. చిన్నతనం నుండి కోపాన్ని అదుపు చేసుకోలేని ఒక కుర్రాడు, తన తల్లికి ఇచ్చిన మాట కోసం, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా వారం మొత్తం లో కోపం తెచ్చుకోకుండా, కేవలం శనివారం మాత్రమే కోపాన్ని చూపించేవాడు. అలాంటి వ్యక్తి జీవితం చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు ఎలాంటి పరిస్థితులకు దారి తీశాయి అనేది సినిమాలో చాలా ఆసక్తికరంగా చూపించాడట డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. టాలీవుడ్ లో ఇప్పటి వరకు మనం ఎన్నో డిఫరెంట్ స్టోరీలను చూసాము కానీ, ఇలాంటి కాన్సెప్ట్ తో ఇప్పటి వరకు సినిమా రాలేదు. వినిపిస్తున్న ఇన్సైడ్ రిపోర్ట్స్ నిజమైతే నాని ఈ చిత్రం తో వంద కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.