Renu Desai పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ గురించి మనం ప్రత్యేకించి చెప్పకపోనవసరం లేదు ఈమె కాస్ట్యూమ్ డిజైనర్ గా ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా మోడల్ గా నటిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. బద్రి, జానీ, మూవీస్ లో పవన్ కళ్యాణ్ పక్కన నటించి పవన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది .. తర్వాత వీళ్ళు ఇద్దరూ అకిరా, ఆధ్య కి జన్మనిచ్చారు.. ఎందుకు విడిపోయారో తెలీదు కానీ విడిపోయి ఎవరి లైఫ్ ని వాళ్ళు హ్యాపీ గా లీడ్ చేసుకుంటున్నారు. కొంతకాలం బ్రేక్ తర్వాత ఈమధ్యనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె, సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉంటుంది. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఆమెకి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది, అదేమిటంటే రీసెంట్ గానే రేణు దేశాయ్ ప్రముఖ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కి వీడియో కాల్ చేసిందట.
పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా దేవర చిత్రం నుండి విడుదలైన ‘చుట్టమల్లే’ లిరికల్ వీడియో సాంగ్ కి ఏ స్థాయి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ సాంగ్ రేణు దేశాయ్ కి కూడా తెగ నచ్చేసిందట. దీంతో వెంటనే ఎన్టీఆర్ కి వీడియో కాల్ చేసి దేవర సాంగ్స్ గురించి రేణు దేశాయ్ ప్రత్యేకించి మాట్లాడి శుభాకాంక్షలు తేలియచేసిందట. నువ్వు ఎన్నో సినిమాలు చేసావు కానీ, నీలో రొమాంటిక్ యాంగిల్ ని ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కూడా హైలైట్ చేయలేకపోయారని, కానీ కొరటాల శివ మాత్రం మీలో యాంగిల్ ని బయటకి తీసుకొచ్చారని, అది నాకు చాలా బాగా నచ్చిందని రేణు దేశాయ్ ఎన్టీఆర్ తో అనిందట. ఇప్పటి వరకు దేవర నుండి వచ్చిన ప్రతీ కంటెంట్ అద్భుతంగా ఉందని, సినిమా నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను అంటూ ఎన్టీఆర్ తో చెప్పిందట.
ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. రేణు దేశాయ్ కి మొదటి నుండి ఇలాంటి ఫ్రెండ్లీ మనస్తత్వం ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. తన పిల్లలిద్దరికీ కూడా ఇది అలవాటు చేసింది. పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ సోషల్ మీడియా లో ఇది వరకు అందరి హీరోల మీద ఎడిటింగ్స్ చేసాడు. అలాగే అప్పట్లో మహేష్ బాబు తో కలిసి రేణు దేశాయ్, అకిరా ఇద్దరు ఫోటో దిగారు. ఇక ఈమధ్య కాలం లో ప్రభాస్ కల్కి చిత్రానికి కూడా రేణు దేశాయ్ తన కొడుకు అకిరా తో కలిసి హైదరాబాద్ లోని ఒక ప్రముఖ థియేటర్ లో వెళ్లిన వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇలా చిన్న తనం నుండే తన తండ్రి ఒక్క పెద్ద సూపర్ స్టార్, ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి అనే గర్వం ఇసుమంత కూడా లేకుండా పెరగడం నిజంగా ప్రశంసనీయం.