Double Ismart : ఎక్కెక్కి తొక్కుడే.. దునియా దున్నుడే.. ఊర మాస్ గా బిగ్ బుల్ లిరికల్ సాంగ్

- Advertisement -

Double Ismart ఎక్కెక్కి తొక్కుడే.. దునియా దున్నుడే.. రేపు కాదు ఇప్పుడే.. నేనే బిగ్ బుల్.. అది మార్తే పక్కా డబుల్ అంటూ రామ్ పోతినేని ఊర మాస్ జాతరతో వచ్చాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ లో ని బిగ్ బుల్ లిరికల్ సాంగ్ ను మేకర్స్ ఇవాళ రిలీజ్ చేశారు. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇక ప్రేక్షకుల్లో చిత్రంపై హైప్ క్రియేట్ చేసేందుకు ఈ సినిమా నుంచి తరచూ ఓ అప్డేట్ వదులుతున్నారు.

Double Ismart
Double Ismart

ఈ క్రమంలోనే ఊర మాస్ యాంథమ్ బిగ్ బుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటకు భాస్కరబట్ల రవికుమార్ లిరిక్స్ అందించగా.. పృథ్వీ చంద్ర, సంజన పాడారు. మణిశర్మ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. ఇస్మార్ శంకర్ కు ఈ చిత్రం సీక్వెల్ గా వస్తున్న విషయం తెలిసిందే. పార్ట్-1 ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే. ఇక ఆ సినిమాలో సాంగ్స్ కూడా సూపర్ హిట్. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమాపైనా అవే అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన పాట చూస్తుంటే డబుల్ ఇస్మార్ట్ లోనూ మ్యూజిక్ డబుల్ అదిరిపోయేలా కనిపిస్తోంది.

Big Bull Lyrical (Telugu) | Double ISMART | Ram Pothineni | Sanjay Dutt | Puri Jagannadh |Manisharma - YouTube

- Advertisement -

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. కావ్య థాపర్ రామ్ కు జోడీగా నటిస్తోంది. .  పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ముంబైలో నిర్వహిస్తున్న నేపథ్యంలో మేకర్స్ ఈ సాంగ్‌ను లాంచ్ చేశారు. రామ్ మరోసారి తనదైన మాస్ స్వాగ్‌తో ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లనున్నట్లు ఈ బిగ్ బుల్ సాంగ్ చూస్తే తెలిసిపోతోందని నెటిజన్లు అంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here