షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఈ నెల 29 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది. దానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా రీసెంట్ గానే మొదలయ్యాయి. ఈ చిత్రం లో విలన్ గా నటించిన ఎస్ జే సూర్య ఇటీవలే ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా, ఈ ఇంటర్వ్యూ లో ఆయన ‘సరిపోదా శనివారం‘ కి సంబంధించిన స్టోరీ లైన్ ని చెప్పాడు. ఆ స్టోరీ లైన్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యి సినిమా మీద మరింత అంచనాలను పెంచేలా చేసింది. స్టోరీ విషయానికి వస్తే ఈ చిత్రం లో హీరో కి చిన్నతనం నుండి విపరీతమైన కోపం ఉంటుంది.
ఈ కోపాన్ని కంట్రోల్ చెయ్యడానికి అతని తల్లి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఆమె హీరో తో ఒక మాట చెప్తూ ‘నీ కోపాన్ని వారం మొత్తం కంట్రోల్ చేసుకో..వారం లో కేవలం శనివారం రోజు మాత్రమే నీ కోపాన్ని చూపించు’ అని అంటుంది. హీరో తన తల్లి చెప్పిన మాటల్ని తూచా తప్పకుండ అనుసరిస్తాడు. అలా అనుసరించడం వల్ల అతని జీవితం లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనేదే మిగిలిన స్టోరీ. సరికొత్త కథాంశం తో తెరెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ కి కనెక్ట్ అయితే ఇక నాని స్టార్ హీరోల లీగ్ లోకి అడుగుపెట్టినట్టే అని అనుకోవచ్చు.