Mehreen Pirzada : బాలిలో మెహరీన్ జాలీ ట్రిప్.. అందంలో హనీ ఈజ్ ది బెస్ట్

- Advertisement -

నేను చెప్పానా.. నేను చెప్పానా.. నేను చెప్పానా… హనీ ఈజ్ ది బెస్ట్.. ఈ డైలాగ్స్ వినగానే ఠక్కున గుర్తొచ్చే పేరు మెహరీన్ ఫిర్జాదా. ఈ బ్యూటీ నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఈ భామ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అప్పటి నుంచి మెహరీన్ కు ఫ్యాన్స్ అయిపోయారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇందులో నేను చెప్పానా.. నేను చెప్పానా అనే డైలాగ్ బాగా ఫేమస్ అయింది.

Mehreen Pirzada
Mehreen Pirzada

ఇక ఈ చిత్రం తర్వాత మెహరీన్ కు వరుస అవకాశాలు వచ్చాయి. ఫిల్లౌరి, కేరాఫ్ సూర్య, మహానుభావుడు, రాజా ది గ్రేట్, జవాన్, నోటా, కవచం, పంతం, చాణక్య, అశ్వత్థామ, ఎంత మంచివాడవురా, మంచిరోజులొచ్చాయి, ఎఫ్2, ఎఫ్3, స్పార్క్ సినిమాల్లో నటించి మెప్పించింది. తన కెరీర్ లో కృష్ణగాడి వీర ప్రేమగాథ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్-2 సిరీస్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.

ఇక ప్రస్తుతం మెహరీన్ విహార యాత్రలో జాలీగా ఎంజాయ్ చేస్తోంది. బాలి అందాలను ఆస్వాదిస్తోంది. తాజాగా తన ట్రిప్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. బీచ్ లో సన్ సెట్ ఆస్వాదిస్తూ దిగిన ఫొటోలు చాలా అందంగా ఉన్నాయి. ఈ ఫొటోల్లో మెహరీన్ ఎల్లో కలర్ ఔట్ ఫిట్ లో సందడి చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Mehreen's Bali Vacation Sets Travel Goals

 

ప్రస్తుతం మెహరీన్ ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. క్యూట్ ఔట్ ఫిట్ లో మెహరీన్ చాలా అందంగా కనిపించింది. సన్ సెట్ లో మెహరీన్ మరింత అందంగా ఉంది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు మెస్మరైజ్ అవుతున్నారు. క్యూట్ హనీ అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, హనీ ఈజ్ ది బెస్ట్ అంటూ ప్రేమ కురిపించేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here