Ram Gopal Varma ఎదుటి మనిషి ఏమి అనుకుంటాడో అనే ఆలోచన ఏమాత్రం కూడా లేకుండా అనిపించింది మాట్లాడడం, మనసుకి నచ్చింది చెయ్యడం వంటివి చేసే సెలెబ్రిటీలు కొంతమంది ఉంటారు. అలాంటి సెలెబ్రిటీల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడుకోకుండా ఉండలేము. ఆయన తీసే సినిమాలు, వేసే ట్వీట్లు, చేసే కామెంట్లు ప్రతీ ఒక్కటి వివాదాస్పదమే. సినిమా హీరోల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వచ్చే రామ్ గోపాల్ వర్మ, రీసెంట్ గా రాజకీయ నాయకుల మీద కూడా వివాదాస్పద వ్యాఖ్యలు, వారి మీద ప్రత్యేకంగా సినిమాలు తియ్యడం వంటివి చేసాడు.
వన్నీ పక్కన పెడితే రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో, ఒక హీరోని ఉద్దేశించి పరోక్షంగా చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘ఈమధ్య కాలం లో కొంతమంది హీరోలు కలెక్షన్స్ విషయం లో చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నారు. బాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలు కార్పొరేట్ బుకింగ్స్ చేస్తూ ఉంటారు. అంటే ఒక కార్పొరేట్ సంస్థ ద్వారా ఆన్లైన్ లో అడ్వాన్స్ బుకింగ్స్ చేయించి, అవి సినిమాకి, సదరు హీరోకి ఉన్న క్రేజ్ గా ప్రాజెక్ట్ చెయ్యడం లాంటివి. ఇప్పుడు ఈ సంస్కృతి టాలీవుడ్ కి కూడా పాకింది. రీసెంట్ గా ఒక హీరో తన సినిమా ఫ్లాప్ అయ్యి థియేటర్స్ నుండి తీసి వేస్తున్న విషయాన్ని తెలుసుకొని, 30 కోట్ల రూపాయిలు ఒక కార్పొరేట్ సంస్థ ద్వారా ఇప్పించి తన సినిమాని రన్ చేసుకున్నాడు. వాస్తవానికి ఆ చిత్రానికి ఫుల్ రన్ లో బయ్యర్లకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది’ అంటూ చెప్పుకొచ్చాడు.
రామ్ గోపాల్ వర్మ ఇది ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడో తెలియనప్పటికీ సోషల్ మీడియా లో మహేష్ బాబే ఇలా చేయించాడని ప్రభాస్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. మరోపక్క ప్రభాస్ తన సలార్ సినిమా హిందీ లో ఆడించడానికి డబ్బులు పంపించాడు అంటూ మహేష్ బాబు అభిమానులు ప్రభాస్ ని ట్రోల్ చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియా లో ప్రస్తుతం ఈ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ నడుస్తున్నాయి.