Hyper Adhi : బట్టలు విప్పినందుకు అనసూయ పరువు తీసేసిన హైపర్ ఆది..వైరల్ అవుతున్న వీడియో!

- Advertisement -

Hyper Adhi ఒక ప్రముఖ ఎమ్మెన్సీ సాఫ్ట్ వేర్ కంపెనీ లో పని చేస్తూ, సినిమాల మీద మక్కువతో చేస్తున్న జాబ్ ని కూడా వదిలేసి వచ్చిన కమెడియన్ హైపర్ ఆది ఇప్పుడు టాలీవుడ్ లో ఏ స్థాయిలో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. జబర్దస్త్ లో అదిరే అభి టీం లో ఒక కంటెస్టెంట్ గా కెరీర్ ని మొదలు పెట్టిన హైపర్ ఆది, ఆ తర్వాత టీం లీడర్ గా మారి అదిరిపోయే పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి, ఆ ఫేమ్ తో ఆయన సినిమాల్లో ఆఫర్లు సంపాదించాడు. ఇప్పుడు హైపర్ ఆది లేని సినిమా లేదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదేమో. ఒకప్పుడు కమెడియన్ అలీ కి ఎలాంటి ఆఫర్లు వచ్చేవో, ఇప్పుడు హైపర్ ఆదికి అలాంటి ఆఫర్లు వస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ హైపర్ ఆది జబర్దస్త్ షో ఆపేసి చాలా కాలం అయ్యినప్పటికీ, ఈటీవీ లో శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోస్ చేస్తున్నాడు.

Hyper Adhi
Hyper Adhi

రీసెంట్ గా ఆయన చేసిన ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. శేఖర్ మాస్టర్, అనసూయ ని ఉద్దేశిస్తూ ఆయన వేసిన పంచులు వైరల్ అయ్యాయి. అసలు విషయానికి వస్తే శేఖర్ మాస్టర్, అనసూయ కలిసి స్టార్ మా ఛానల్ లో ‘కిరాక్ బాయ్స్, కిలాడి లేడీస్’ అనే షో చేస్తున్నారు. ప్రతీ శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే ఈ షో కి సంబంధించిన ఒక ఎపిసోడ్ లో, ఒక గేమ్ ఆడేందుకు శేఖర్ మాస్టర్, అనసూయ బట్టలు విప్పి మరీ పోటీ పడుతారు.

వామ్మో.. ఆ షోలో హైపర్ అది, అనసూయ రచ్చ మాములుగా లేదుగా! – News18 తెలుగు

- Advertisement -

దీనిపై హైపర్ ఆది పంచులు వేస్తూ అక్కడేమో వాళ్ళ కోసం కోట్లు విప్పేసారు. ఇక్కడ మాత్రం స్టేజి మీదకి రమ్మన్నా రారు అని ఆ షో లో శేఖర్ మాస్టర్ ఎలా చేసాడో, అలా హైపర్ ఆది అనుకరిస్తాడు. అనసూయ పాత్రలో యాంకర్ నందు వ్యవహరిస్తాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇకపోతే హైపర్ ఆది ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియన్ మూవీ పుష్ప ది రూల్ లో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరో నాలుగు తెలుగు సినిమాల్లో ఆయన కమెడియన్ గా చేస్తున్నాడు.

Hyper Aadi

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here