Double Ismart ట్రైలర్ లో ఇవి గమనించారా..? పూరి జగన్నాథ్ మళ్ళీ ఫామ్ లోకి రావడం కష్టమే!

- Advertisement -

Double Ismart  : నిర్మాతగా మారిన తర్వాత వరుస ఫ్లాప్స్ అందుకున్న పూరిజగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ తో అటు నిర్మాతగానూ , దర్శకుడిగానూ భారీ కం బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. వరుస ఫ్లాప్స్ లో ఉన్న రామ్ కి కూడా ఈ చిత్రం ఉపయోగపడింది. అలాగే కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ దాటికి వెనుకబడిన సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కూడా ఈ చిత్రం తో భారీ కం బ్యాక్ ఇచ్చాడు. ఒకవిధంగా ఈ చిత్రం అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి ప్రధాన కారణం కూడా మణిశర్మ అందించిన సంగీతమే. ఇప్పుడు విజయ్ దేవరకొండ తో భారీ బడ్జెట్ తో తీసిన పాన్ ఇండియన్ చిత్రం లైగర్ ఫ్లాప్ తో పూరి జగన్నాథ్ పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళిపోయాడు.

Double Ismart
Double Ismart

ఇప్పుడు ఆ నష్టాల నుండి బయటకి రావడానికి ఆయన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ తో ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి పాటలు విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకోగా, నిన్న ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన లభించింది. ట్రైలర్ చూస్తున్నంతసేపు మనం ఇస్మార్ట్ శంకర్ మూవీ ట్రైలర్ ని చూస్తున్నామా, లేక డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ ని చూస్తున్నాము అనే అనుభూతి కలిగింది. హీరోయిన్ కావ్య థాపర్ తో ఉన్న సన్నివేశాలు కూడా ఇస్మార్ట్ శంకర్ సినిమా నుండే కాపీ కొట్టినట్టుగా అనిపించింది.

Puri Jagannadh's 'Double ISMART' teaser featuring Ram Pothineni and Sanjay Dutt is out, watch here

- Advertisement -

అయితే ఈ చిత్రం లోని చిన్న మార్పు ఏమిటంటే విలన్ సంజయ్ దత్ తన మెదడు ని హీరోలోకి పంపించి తనలాగా ఆలోచించే మరొకరిలా హీరోని తయారు చేసి తన ముఖ్యమైన పనుల కోసం వాడుకోవాలని చూస్తాడు. చివర్లో ఒకే ఆలోచనలతో ఉన్న ఈ ఇద్దరు కొట్టుకుంటారు. ఇదే పూరి జగన్నాథ్ ట్రైలర్ లో చూపించాడు. మొదటి భాగం లో హీరోయిన్ చనిపోతుంది, ఆ బాధలో ఉన్నటువంటి హీరో ‘డబుల్ ఇస్మార్ట్’ లో కొత్త హీరోయిన్ తో ఎందుకు ఉన్నాడు?, వీళ్ళ మధ్య అంతటి రిలేషన్ ఎలా ఏర్పడింది అనేది వెండితెర మీద చూడాలి. మొత్తానికి డబుల్ ఇస్మార్ట్ అని చెప్పి ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని ప్రేక్షకులకు పూరి జగన్నాథ్ చూపించబోతున్నాడని ఈ ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది. మరి ట్రైలర్ లాగానే సినిమా ఉంటుందా, లేదా అంచనాలను తారుమారు చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందా అనేది చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here