Niharika Konidela సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఈ మెగా డాటర్ తరచూ తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇటీవల తన ప్రొడక్షన్ నుంచి వస్తున్న కమిటీ కుర్రోళ్లు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ క్రమంలో నిహారిక ట్రెడిషన్ ఔట్ ఫిట్స్ ను ఈ ప్రమోషన్ కోసం సెలెక్ట్ చేసుకుంది.
ఇందులో భాగంగా తాజాగా చీరకట్టులో సందడి చేసింది. లైట్ పింక్ కలర్ చీరలో నిహారిక చాలా అందంగా కనిపించింది. జుట్టు ముడేసుకుని పదహారణాల తెలుగు ఆడపడుచులా తన అందంతో మైమరిపించింది. చెవులకు పెద్దపెద్ద ఝుంకాలతో నుదుటిన బొట్టుతో సంప్రదాయంగా కనిపించి మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.
ఇక నిహారిక సినిమా కెరీర్ సంగతికి వస్తే.. ఈ బ్యూటీ మెగా కాంపౌండ్ నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టినా.. మెగా వారసుల్లా తన కెరీర్ ను మలుచుకోలేదు. నా రూటే సపరేటు అంటూ అటు సినిమాల్లో.. ఇటు వెబ్ సిరీస్ లలో నటిస్తూ.. సినిమాలు నిర్మిస్తోంది కూడా. డిఫరెంట్ స్క్రిప్ట్స్ తో నేటి తరానికి చేరువయ్యే సినిమాలను నిర్మిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కమిటీ కుర్రోళ్ల అనే ప్రాజెక్టుతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఓ తమిళ సినిమాలోనూ ఈ భామ నటిస్తోంది.