Mr. Bachchan : ఈమధ్య కొంతమంది హీరోయిన్లు కేవలం ఒక్క సినిమాతోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకుంటున్నారు. అలా ఇటీవల కాలం లో సెన్సేషన్ గా నిల్చిన శ్రీలీల ని అంత తేలికగా ఎవరు మాత్రం మర్చిపోగలరు. పెళ్లి సందడి సినిమా తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆమె, ఆ సినిమా తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. అలా రీసెంట్ ఇండస్ట్రీ కి వచ్చిన మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్స్ జాబితాలోకి చేరిపోయింది. ఇప్పుడు ఈమె లాగానే మరో యంగ్ హీరోయిన్ కూడా తెలుగు సినిమా పరిశ్రమని ఒక ఊపు ఊపేందుకు సిద్ధం అవుతుంది. ఆమె మరెవరో కాదు భాగ్య శ్రీ భోర్సే. ఈమె రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం లో హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమా ఇంకా థియేటర్స్ లో విడుదల కూడా అవ్వలేదు కానీ, భాగ్యశ్రీ అప్పుడే అబ్బాయిల కలల రాకుమారి అయిపోయింది. ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ లో ఆమె అందచందాలను చూసి కుర్రాళ్ళు మెంటలెక్కిపోతున్నారు. పాలరాతి బొమ్మ లాగ మెరిసిపోతున్న ఈ హాట్ బ్యూటీ నటన పరంగా కూడా రాణిస్తే, శ్రీలీల స్థానాన్ని అవలీలగా రీప్లేస్ చేస్తుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే ఈ హాట్ బ్యూటీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి?, ఈమె ఎక్కడి నుండి వచ్చింది వంటి విషయాలు తెలుసుకునేందుకు యువత అమితాసక్తిని చూపిస్తున్నారు. అవి ఒక్కసారి పరిశీలిస్తే ఈమె తండ్రి ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అని తెలుస్తుంది.
చిన్నప్పటి నుండి సినిమాల మీద అమితాసక్తి ఉన్న భాగ్యశ్రీ తొలుత మోడలింగ్ రంగం లో ప్రయత్నాలు చేస్తుండగా ఈమె ఫోటోలు డైరెక్టర్ హరీష్ శంకర్ దృష్టిలో పడ్డాయి. తన సినిమాకి కొత్త హీరోయిన్ కోసం ఆడిషన్స్ చేస్తున్న హరీష్ శంకర్, ఒకరోజు భాగ్యశ్రీ ని పిలిచి ఆడిషన్ చేసి రవితేజ తో కొన్ని ఫోటో షూట్స్ చేయించాడు. ఆ ఫోటోషూట్ కి సంబంధించిన ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియా లో అప్లోడ్ చెయ్యగా అవి సెన్సేషనల్ గా మారింది. అలా ఈ చిత్రం నుండి ఒక్కో ప్రమోషనల్ కంటెంట్ విడుదల అవుతూ రాగా భాగ్యశ్రీ భోర్సే రవితేజ ని బాగా డామినేట్ చేసింది. అంతే కాకుండా ఈ సినిమా మీద విపరీతమైన హైప్ పెరగడానికి కారణం కూడా భాగ్యశ్రీ నే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. మరి విడుదల తర్వాత ఈ హాట్ బ్యూటీ ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి.