Viva Harsha యూట్యూబ్ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించి తద్వారా సినిమాల్లో కూడా అవకాశాలను పొంది ఉన్నత స్థాయికి వెళ్లినవారిలో ఒకరు వైవా హర్ష. కెరీర్ మంచి ఊపులో దూసుకుపోతున్న సమయంలోనే ఆయన 2021 వ సంవత్సరం లో తన ప్రేయసి అక్షర ని పెళ్లి చేసుకున్నారు. అయితే ఈమధ్యనే ఆయన సోషల్ మీడియా లో పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘జీవితం అనేది ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది, ఎత్తుపల్లాలు, చిరాకులు, ఎక్సైట్మెంట్ , భయం, థ్రిల్, ఇలా చాలా ఉంటాయి, కానీ అవి ఏవి మన చేతుల్లో ఉండవు, మనల్ని ఆపడానికి వస్తాయి, తర్వాత అవే వెళ్లిపోతాయి, అప్పటి వరకు మనం బకెల్ పట్టుకొని కూర్చొని రైడ్ ని ఎంజాయ్ చేయడమే.ఏది ఆశించకూడదు తర్వాత బాధ పడకూడదు, జీవితం ఎటు తీసుకు వెళ్తే అటు సైడ్ వెళ్లిపోవడమే’ అంటూ ఆయన ఒక పోస్టు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పెట్టాడు.

ఈ పోస్టుని చూసి ఆయన అభిమానులు ఎప్పుడూ చలాకీ గా ఉండే హర్ష, అకస్మాత్తుగా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నదేంటి, అసలు ఏమైంది అని అనుకున్నారు. ఈమధ్యనే పెళ్లి అయ్యింది కదా, భార్యతో విబేధాలు వచ్చి విడిపోవాలని అనుకుంటున్నాడా ?, అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడా? అని అందరు అనుకున్నారు. సోషల్ మీడియా లో దీని గురించి పెద్ద ఎత్తున చర్చ నడించింది. దీనిపై ఆయన స్పందిస్తూ ‘నా వ్యక్తిగత జీవితం ఎంతో బాగుంది, కెరీర్ లోనే చిన్న చిన్న ఆటంకాలు ఉన్నాయ్’ అంటూ చెప్పుకొచ్చారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘నా ఓల్డ్ పోస్ట్ కోసం ఆరా తీస్తున్న వాళ్లందరికీ కృతజ్ఞతలు.నా యోగ క్షేమలు గురించి ఆలోచించే వారు ఇంత మంది ఉన్నారా అని చాలా సంతోషం వేసింది. నా వైవాహిక జీవితం ఎంతో సాఫీగా సాగుతుంది. కానీ కెరీర్ విషయం లో కొన్ని చిక్కులు వచ్చాయి. కొంతమంది చేసే రాజకీయాల కారణంగా నేను నష్టపోతున్నాను. ఇలాంటివి ప్రతీ రంగం లో కామన్ గానే ఉంటాయి. నా అనుభవం దృష్ట్యా మీకు ఒకటి చెప్తున్నాను. ఇది నువ్వు చెయ్యలేవు , నీ వల్ల కాదు అని ఎదుటి వ్యక్తి నీ మీదకు వేలు చూపించే స్థాయి ఎప్పుడు తెచుకోకు. ఒంటరిగా నేనొక్కడినే పూర్తి చెయ్యగలను అనే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి’ అంటూ ఈ సందర్భంగా ఆయన తెలిపాడు.