OTT movies నిన్న గాక మొన్ననే జనవరి 1 వ తేదీ వచ్చినట్టు ఉంది. కానీ అప్పుడే ఈ ఏడాదిలో ఆరు నెలలు గడిచిపోయాయి. ఈ ఆరు నెలల్లో చాలా సినిమాలు విడుదల అయ్యాయి, కానీ బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం కొన్ని మాత్రమే సూపర్ హిట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా సంక్రాంతి పండుగ నాడు వచ్చిన చిత్రాల్లో ‘హనుమాన్’ కమర్షియల్ గా ఎంత పెద్ద మెగా బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాత హిట్స్ పడ్డాయి కానీ అనుకున్న రేంజ్ లో మాత్రం ఆడలేదు. కానీ రీసెంట్ గా విడుదలైన ప్రభాస్ కల్కి చిత్రం మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సునామీని సృష్టించింది. స్తబ్దుగా ఉన్న ట్రేడ్ ని ఒక్కసారిగా మళ్ళీ గాడిలో పెట్టింది ఈ చిత్రం. ఈ సినిమా ఈ నెల 23 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది కాసేపు పక్కన పెడితే ఈ ఏడాది ఓటీటీలో విడుదలైన క్రేజీ టాలీవుడ్ మూవీస్ లో ఏ చిత్రానికి ఎక్కువ వసూళ్లు వచ్చాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం.
ముందుగా మనం సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ చిత్రం గురించి మాట్లాడుకోవాలి. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. కానీ ఓటీటీ లో మాత్రం ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా హిందీ వెర్షన్ అయితే దాదాపుగా 50 రోజుల వరకు ట్రెండ్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ సంస్థ వారి అంచనాల ప్రకారం ఈ ఏడాది అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు సినిమాగా ‘గుంటూరు కారం’ నిల్చింది. సుమారుగా 5 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయట. ఇక ఆ తర్వాతి స్థానం లో ప్రభాస్ ‘సలార్’ చిత్రం నిల్చింది.
గత ఏడాది డిసెంబర్ చివర్లో వచ్చిన ఈ చిత్రం జనవరి మొదటి వారం లో ఓటీటీ లో విడుదలైంది. థియేటర్స్ లో బంపర్ హిట్ గా నిల్చిన ఈ చిత్రం, ఓటీటీ లో మాత్రం అనుకున్న రేంజ్ ని దక్కించుకోలేకపోయింది. ఈ చిత్రానికి కేవలం నాలుగు మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయట. ఇక మూడవ స్థానం లో హనుమాన్ నిల్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద స్టార్ హీరోలకు కూడా సాధ్యం కానీ రికార్డు కలెక్షన్స్ ని నెలకొల్పిన ఈ చిత్రం, ఓటీటీ లో మాత్రం 3.7 మిలియన్ వ్యూస్ తో మూడవ స్థానానికి పరిమితం అయ్యింది. ఈ చిత్రం తర్వాత ప్రసన్నవదనం, భీమా వంటి చిత్రాలు నిలిచాయి. ఇక త్వరలో ఓటీటీ లో దర్శనం ఇవ్వబోతున్న కల్కి చిత్రం ఏ స్థానం లో ఉంటుందో చూడాలి.