Director Rajamouli : వెయ్యి కోట్లు ఇచ్చినా ఆ హీరో తో సినిమా చెయ్యను : రాజమౌళి

- Advertisement -

Director Rajamouli ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో స్టార్ హీరోలను మించిన సూపర్ స్టార్ స్టేటస్ ఉన్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే అది దర్శక ధీరుడు రాజమౌళి మాత్రమే. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానం నేడు #RRR తో ఆస్కార్ అవార్డ్స్ దక్కించుకునే రేంజ్ కి వెళ్ళింది. ముఖ్యంగా మన సౌత్ ఇండియన్ సినిమాలకు కానీ, టాలీవుడ్ సినిమాలకు కానీ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా అన్నీ ప్రాంతాలలో మార్కెట్ ఓపెన్ అయ్యింది అంటే అది రాజమౌళి పుణ్యమే. తన మెదడు లో ఉన్న విజన్ ని కార్యరూపం దాల్చే వరకు ఆయన పట్టువదలని విక్రమార్కుడు లాగ పనిచేస్తుంటాడు. ఎలాంటి విషయం లో కూడా ఆయన కంప్రమైజ్ అవ్వడం ఇప్పటి వరకు ఎవ్వరూ చూడలేదు.

Director Rajamouli
Director Rajamouli

చిన్న చిన్న షాట్స్ కూడా పర్ఫెక్ట్ గా రావాల్సిందే. అందుకే ఆయన సినిమాలు అంత ఆలస్యం గా థియేటర్స్ లో విడుదల అవుతుంటాయి. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన వర్క్ షాప్ లో తరచూ పాల్గొంటున్న మహేష్ బాబు, ఈ ఏడాది లోనే ఈ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకి రానున్నాయి. ఇకపోతే రీసెంట్ గా ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికకి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూ లో రాజమౌళి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.

SS Rajamouli, Maker of Myths

- Advertisement -

ఆయన మాట్లాడుతూ ‘పలానా హీరోతో సినిమా చెయ్యాలని నేను ఇప్పటి వరకు ఎప్పుడూ అనుకోలేదు. ముందు నా కథ ని పర్ఫెక్ట్ గా విజువలైజ్ చేసుకుంటాను. ఆ తర్వాత కథకు తగ్గ పాత్రలను ఎంచుకుంటాను. హీరో అయినా, విలన్ అయినా, హీరోయిన్ అయినా, చిన్న క్యారక్టర్ ఆర్టిస్టు అయినా కథకి తగ్గట్టుగా అనిపిస్తేనే తీసుకుంటాను. ఆ హీరో కి మార్కెట్ ఉందా, క్రేజ్ ఉందా, హిట్లు ఉన్నాయా లేవా అనేవి అసలు చూడను. ఒకవేళ నిర్మాత వత్తిడి చేసి, ఆ హీరోతోనే చెయ్యమంటే వెయ్యి కోట్ల రూపాయిలు ఇచ్చినా చెయ్యను’ అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి. ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.

SS Rajamouli Breaks Silence on Bollywood vs South Debate, And Making Movie on Mahabharata

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here