Allu Arjun గత కొంత కాలంగా సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ అభిమానులు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య ఏ స్థాయిలో గొడవలు జరుగుతున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. అల్లు అర్జున్ ‘సరైనోడు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమని అభిమానులు కోరగా, చెప్పను బ్రదర్ అని అంటాడు. అప్పట్లో ఆయన అన్న ఈ మాట పెను దుమారమే రేపింది. అప్పటి వరకు మెగా ఫ్యామిలీ మొత్తం ఒక్కటే అనే భావనతో ఉండే అభిమానులు అల్లు అర్జున్ ని దూరం పెట్టడం ప్రారంభించారు. కానీ పవన్ కళ్యాణ్ కష్టసమయం లో అల్లు అర్జున్ అండగా నిలబడడం, జనసేన పార్టీ కి బహిరంగంగా సపోర్టు చెయ్యడంతో అందరూ కలిసిపోయారు.
కానీ 2024 ఎన్నికల సమయం లో అల్లు అర్జున్ వైసీపీ పార్టీ నంద్యాల ఎమ్మెల్యే క్యాండిడేట్ కి బహిరంగంగా వెళ్లి సపోర్టు పలకడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. అల్లు అర్జున్ పై విపరీతమైన ట్రోల్ల్స్ వేస్తూ తమ అసహనం ని వ్యక్తపరిచారు. దీనికి అల్లు అర్జున్ అభిమానులు కూడా బాగా తమ హీరోని డిఫెండ్ చేస్తూ పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చెయ్యడం మొదలు పెట్టారు. అలా ఇరువురి హీరోల అభిమానుల మధ్య ఇప్పటికీ కూడా ఫ్యాన్ వార్స్ నడుస్తూనే ఉన్నాయి. అయితే వీటికి అల్లు అర్జున్ తల్చుకుంటే ఫులుస్టాప్ పెట్టొచ్చు. పవన్ కళ్యాణ్ ఎన్నికలలో విజయం సాధించిన సందర్భంగా మెగా ఫ్యామిలీ తరుపున ఆయనకి పెద్ద ఎత్తులో ఘన స్వగతం పలికి సంబరాలు చేసారు.
ఈ సంబరాల్లో మెగా కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ హాజరు అయ్యారు కానీ, అల్లు ఫ్యామిలీ మాత్రం హాజరు కాలేదు. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య చాలా గ్యాప్ పెరిగింది అని అభిమానులు అనుకున్నారు. అయితే రీసెంట్ గానే నిహారిక కొణిదెల తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం పాల్గొన్న ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ నంద్యాల కి వెళ్లిన సంఘటన గురించి అడిగారు. దీనికి నిహారిక కొణిదెల సమాధానం చెప్తూ ‘ఎవరికైనా వ్యక్తిగత అభిప్రాయాలూ ఉంటాయి. ఎవరి ఇష్టం వారిది. వాళ్ళ ఇష్టాన్ని మనం గౌరవించాలి. అల్లు అర్జున్ గారి నిర్ణయాన్ని కూడా మేమంతా గౌరవించాం, ఆయన మీద మాకు ఎలాంటి కోపం లేదు’ అని చెప్పుకొచ్చింది నిహారిక.