Sri reddy సోషల్ మీడియా ని ఆధారంగా తీసుకొని, రాజ్యాంగం మాట్లాడే హక్కు ఇచ్చింది అనే ఒక్క కారణాన్ని అడ్డుపెట్టుకొని కొంతమంది చేసే పనులు చూసేందుకు ఎంత దారుణంగా అనిపిస్తాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విమర్శలు అవసరమే, కానీ హద్దు ని దాటి విమర్శించి, నెటిజెన్స్ లో అటెన్షన్ ని సంపాదించే చీప్ ట్రిక్స్ తెలిసిన వారిలో ఒకరు శ్రీ రెడ్డి. ఈమె ఒకప్పుడు సాక్షి టీవీ లో జర్నలిస్ట్ గా పని చేసింది. ఆ తర్వాత సినిమా ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేసింది. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ లో తన మెంబెర్ షిప్ రద్దు చేసారు అంటూ అప్పట్లో ఈమె ఆఫీస్ ముందు నగ్నంగా కూర్చొని ధర్నా చేసిన ఘటన అప్పట్లో ఎంత పెద్ద దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికీ కూడా ఆమె తీరు ఏమాత్రం కూడా మారలేదు.
పవన్ కళ్యాణ్, నాని, రకుల్ ప్రీత్ సింగ్, చిరంజీవి, రామ్ చరణ్, చంద్ర బాబు, లోకేష్ ఇలా ఒక్కరిని కాదు ఎంతో మందిని టార్గెట్ చేసి ప్రతీ రోజు నోటికి వచ్చిన అడ్డమైన బూతులు మాట్లాడుతూ అసలు ఈమె నిజంగా అమ్మాయేనా అని ప్రతీ ఒక్కరు అసహ్యించుకునేలా చేసింది. రాజకీయంగా జగన్ నా దేవుడు , నా అన్నయ్య అంటూ అతనికి సపోర్టుగా నిలబడి, అతనికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతీ ఒక్కరిని చాలా నీచంగా తిడుతూ ఉండేది శ్రీ రెడ్డి. ఈమెని కార్యకర్త గా గుర్తిస్తే పార్టీ కి ఉన్న ఆ కాస్త పరువు కూడా పోతుంది అని జగన్ ఈమెని గుర్తించలేదు. ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ రెడ్డి గతం చేసిన పనులకు నెటిజెన్స్ కౌంటర్లు ఇస్తున్నారు.
వాటిని తట్టుకోలేక రీసెంట్ గా ఆమె ఎమోషనల్ గా పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ లో ఆమె మాట్లాడుతూ ‘నేను మానసికంగా చాలా కృంగిపోయాను. మళ్ళీ ఎప్పటికీ మాములు మనిషిని అవుతానో కూడా నాకు తెలియదు. నాకు ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచనలు వస్తున్నాయి. ఈ ఆలోచనల నుండి నన్ను ఆ భద్రకాళి కాపాడాలి. ఒకవేళ నేను ఏదైనా చేసుకుంటే దానికి టీడీపీ, జనసేన పార్టీ మీడియా, కార్యకర్తలే అందుకు కారణం. ఈరోజు నేను మాట్లాడేది మీకు కామెడీ గా అనిపించొచ్చు, కానీ త్వరలోనే మీకు అర్థం అవుతుంది. ఈ శరీరం తో నేను ఎక్కువ కాలం బ్రతకలేను. ఎవరి కోసం పోరాడి నేను ఇలాంటి పరిస్థితికి వచ్చానో, ఆ వైసీపీ వాళ్ళే ఈరోజు నన్ను గుర్తించడం లేదు. ఇది నన్ను ఇంకా బాధకి గురి చేస్తుంది’ అంటూ శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారాయి.