OTT Movies ఓటీటీ లో ఈమధ్య భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ వెబ్ సిరీస్ లు, సినిమాలు చూస్తున్నారు. అలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ తో పాటుగా ఇండియన్ ఆడియన్స్ కూడా అమితాసక్తితో చూసిన సిరీస్ లు కొన్ని ఉన్నాయి. వాటిల్లో నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న స్క్విడ్ గేమ్స్ అనే వెబ్ సిరీస్ ఒకటి. లాక్ డౌన్ సమయం లో వచ్చిన ఈ సిరీస్ కి ప్రేక్షకుల నుండి విశేషమైన ఆదరణ దక్కింది. ఇప్పటికీ కూడా ఈ సిరీస్ ని ఆడియన్స్ ప్రతీ వారం లక్షల సంఖ్యలో చూస్తూనే ఉంటారు. ఈ సిరీస్ ని ఇప్పటి వరకు చూడని వారు ఎవరైనా ఉంటే, వారికోసం ఈ సిరీస్ స్టోరీ లైన్ అందిస్తున్నాం చూడండి. హీరో ఒక పేద కుటుంబానికి చెందిన వాడు. అప్పులు చేసి జీవనం సాగించే హీరో, ఎక్కువగా బెట్టింగ్ గేమ్స్ ఆడుతూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు.
అలా ఒకరోజు అతనికి ఒక వ్యక్తి పరిచయమై ఒక గేమ్ ఆడుతాడు. ఆ గేమ్ లో హీరో ని గెలిచేలా చేసి అతనికి భారీ మొత్తం లో విన్నింగ్ అమౌంట్ ఇస్తాడు. ఇంకా ఇలాంటి గేమ్స్ ఆడాలని అనుకుంటే ఇక్కడికి వచ్చేయ్ అని ఒక ఫోన్ నెంబర్ ఉన్న కార్డు ని ఇచ్చేసి పోతాడు. అత్యంత పేదరిక కుటుంబం లో ఇమడలేక, కష్టాలను అధిగమించడానికి హీరోకి ఆ గేమ్స్ ఆడి డబ్బులు సంపాదించడమే మార్గం అని ఫిక్స్ అయ్యి కార్డు మీద ఉన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేస్తాడు. ఫోన్ ఎత్తుకున్న వారు ఒక అడ్రస్ ఇచ్చి అక్కడికి రమ్మంటారు. అక్కడికి రాగానే హీరో ముఖం మీద మత్తు మందు చల్లి, ఒక దీవిలోకి తీసుకెళ్తారు. అక్కడ హీరో లాగానే ఎంతోమంది డబ్బుకి ఆశపడి గేమ్స్ ఆడేందుకు వచ్చి ఉంటారు. అలా వీరంతా ఒక హాస్టల్ రూమ్ లో స్టూడెంట్స్ ఎలా ఉంటారో, అలా ఒక యూనిఫామ్ వేసుకొని ఉంటారు.
మొదటి గేమ్ మొదలు అవ్వుద్ది. అప్పటి వరకు ఈ గేమ్స్ అన్నీ మాములు గేమ్స్ లాగ అనుకుంటారు ఆటగాళ్లంతా. కానీ ఓడిపోయినవారు చనిపోవడమే అని మొదటి రౌండ్ ముగిసిన తర్వాత తెలుసుకొని షాక్ కి గురి అవుతారు. అలా మొదటి రౌండ్ లోనే అక్కడికి వచ్చిన వారిలో 50 శాతం కి పైగా గేమ్ లో ఎలిమినేట్ అయ్యి చనిపోతారు. అలా రౌండ్స్ అన్ని పూర్తి చేసుకొని హీరో ప్రైజ్ మనీ ని గెలుస్తాడా లేదా అనేదే స్టోరీ. ఈ సిరీస్ కి సంబంధించిన సీక్వెల్ షూటింగ్ చాలా కాలం నుండి జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ సిరీస్ ని డిసెంబర్ నెలలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తుంది నెట్ ఫ్లిక్స్ సంస్థ. ఇప్పటి వరకు మొదటి సీజన్ ని ఎవరైనా చూసి ఉండకపోతే నెట్ ఫ్లిక్స్ లో చూడండి, తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉంది.